కుటుంబ నియంత్రణలోనూ,లైంగిక వ్యాధుల నివారణలోనూ కండోమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది కండోమ్‌ను వాడటం ద్వారా 100% రక్షణ లభిస్తుందని అనుకుంటారు. వాస్తవం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. నిపుణుల ప్రకారం, కండోమ్ వాడకం ద్వారా దాదాపు 90% రక్షణ లభిస్తుంది. మిగతా 10%లో మాత్రం చిన్న చిన్న పొరపాట్లు ప్రమాదానికి కారణమవుతాయి.
అనుకోని గర్భం వచ్చే అవకాశం
కండోమ్ వాడకం ప్రాథమిక ఉద్దేశ్యం అవాంఛనీయ గర్భధారణను నివారించడం. అయితే ఫోర్‌ప్లే సమయంలో పురుషులు భాగస్వామి గుప్తాంగాలను తాకడం, ఆ తర్వాత అదే చేతులతో పురుషాంగానికి కండోమ్ ధరించడం జరుగుతుంది. ఈ సమయంలో చేతి వేల్లపై ఉండే తక్కువ మోతాదులోని శుక్లకణాలు కండోమ్ వెలుపలి పొరపై పడే ప్రమాదం ఉంది. దాంతో ఆ శుక్లకణాలు గర్భాశయంలోకి వెళ్లిపోయి అరుదైన సందర్భాల్లో గర్భం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం, ఈ అవకాశం కేవలం 1% కన్నా తక్కువ మాత్రమే. కానీ జాగ్రత్త అవసరం.

వ్యాధుల వ్యాప్తి ముప్పు
కండోమ్ రెండో ముఖ్య ఉద్దేశం లైంగిక వ్యాధులను అడ్డుకోవడం. అయితే సంభోగం సమయంలో అధిక ఉత్సాహం వల్ల, శిఖరాగ్రానికి చేరుకున్నాక కండోమ్ చిట్లిపోవచ్చు. చాలా అరుదుగానే ఇది జరుగుతున్నా,ఒకసారి కండోమ్ పగిలితే వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది.
మరొక సమస్య - అలర్జీ
కొంతమంది మహిళలకు లేటెక్స్ పదార్థంతో తయారుచేసిన కండోమ్‌లు పడవు. వాటివల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డాటెడ్ కండోమ్లు (ఆనందం పెంచేందుకు తయారుచేసినవి) కొంతమంది మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మరికొంత మంది మహిళలు తమ భాగస్వాములు సంభోగం సమయంలో కండోమ్ వాడటాన్ని ఇష్టపడరు. వారికి లైంగిక ఆనందం లేదా లైంగిక తృప్తి కలగదని ఓ సర్వేలో వెల్లడించడం జరిగింది.
కండోమ్ అనేది నిర్ధారితమైన రక్షణ సాధనం మాత్రమే. కానీ ప్రతి సందర్భంలో ఇది పూర్తిగా భరోసా ఇవ్వదని గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో వాడితే కండోమ్ విశ్వసనీయంగా పనిచేస్తుంది. కాని కేవలం దానిపైనే పూర్తిగా ఆధారపడటం మాత్రం సరైంది కాదు!



Click it and Unblock the Notifications




