రతిక్రీడలో పరాకాష్ట భావప్రాప్తి. ఆ దశకు చేరినప్పుడు కలిగే శారీరక, మానసిక ఆనందం, తృప్తి వర్ణనాతీతమైంది. స్వర్గపుటంచులు చూసిన అనుభూతి కలుగుతుంది. అటువంటి అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాలే గానీ అనుభవంలోకి వచ్చినట్లు నటించకూడదని, అనుభవాన్ని పొందడానికి మార్గాలు చూసుకోవాలని, అందుకు తగిన విధంగా వ్యవహరించాలని అంటారు. భర్తకోసం భావప్రాప్తికి చేరినట్లు నటించే స్త్రీలు తమ సంసార జీవితాన్ని నష్టపరుచుకున్నట్లేనని చెబుతారు.
కొంత మంది స్త్రీలు భర్తల వద్ద భావప్రాప్తి పొందినట్లు నటిస్తారని నిపుణులు చెబుతున్నారు. చాలామంది స్త్రీలు సెక్స్‌లో పాల్గొనేటపుడు సిగ్గును, బిడియాన్ని వదలిపెట్టారు. తనకు ఎలా ఆనందంగా ఉంటుందో భర్తతో చెప్పడానికి వెనకాడుతారు. ఇందుకు అతను ఏమనుకుంటాడో అనే భయం ఒక కారణం కాగా, బిడియం మరో కారణం. దీంతో సెక్స్‌లోని మాధుర్యాన్ని తనివితీరా అనుభవించలేరు. ఫలితంగా రతి అనేది యాంత్రికంగా మారిపోయి, విసుగు తెప్పిస్తుది. పురుషుడు మాత్రం తన పని తాను చేసుకుపోతూనే ఉంటాడు. కానీ, భాగస్వామి చురుకైన పాత్ర లేకపోవడం అతడ్ని కూడా అసంతృప్తికి గురవడం ఏదో ఒక రోజు జరిగి తీరుతంది.
యాంత్రికమైన సంభోగంలో పాల్గొంటున్న స్త్రీ చివరికి భావప్రాప్తికి చేరినట్లు (వదిలించుకునేందుకు) అతడి ముందు ప్రవర్తిస్తుంది. దీంతో పురుషుడు ఆమెకు విశ్రాంతినిస్తాడు. దీనివల్ల ఆ స్త్రీ కోల్పోతున్న ఆనందం చాలా ఉంది. సెక్స్‌లో ఏం కావాలో, ఎలా కావాలో అడిగి పొందటం ఆమె హక్కుగా భావించాలి. భావప్రాప్తి విషయంలో నటిస్తుంటే తాను చేస్తున్నది సక్రమమే అనుకుని పురుషుడు తన పాతపద్ధతినే కొనసాగిస్తాడు. ఫలితంగా భావప్రాప్తికి చేరని అసంతృప్తి సెక్స్‌తోనే జీవితం గడిచిపోతుంది.
పురుషుడి చేతిని తనకు ఇష్టమైన భాగాలవైపు తీసుకెళ్లడం, అతని పెదవులు తన శరీర భాగం మీద ఎక్కడెక్కడ తాకాలని కోరుకుంటున్నారో అటువైపు తీసుకెళ్లడం ఆమే చేయాలి. అప్పుడే భావప్రాప్తి ఆనందం శాశ్వతమవుతుంది. పురుషుడిని తనకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించేలా చేసుకునే అవకాశం స్త్రీకి ఉంటుంది. పురుషుడిని రెచ్చగొట్టి అతనికి ఆనందాన్ని పంచుతూ తాను ఆనందం పొందే విధంగా స్త్రీ వ్యవహరించాలి. అందుకే పురుషుడితో కామం విషయంలో భార్య రంభలాగా వ్యవహరించాలని మన ప్రాచీనులు చెప్పారు.