భార్యాభర్తల్లో పెళ్లి తర్వాత కొన్ని రోజుల వరకు ఆకర్షణ ఉంటుంది. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత క్రమంగా ఆకర్షణ తగ్గిపోతుందని అంటారు. దానికితోడు, సంసారంలోని ఒడిదొడుకులు, సమస్యల వల్ల ఇరువురి మధ్య వాదనలు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతాయి.
పరస్పరం అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తీరిక లేని పనుల వల్ల కూడా సెక్స్ పట్ల స్త్రీపురుషుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. తన భార్యలను పట్టించుకోని బిజీ షెడ్యూల్‌తో భర్తలు ఉంటే అది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అయితే, సంసార సుఖం పొందాలంటే ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత, అనురాగం ఎంతో ముఖ్యం. సెక్స్ జీవితం ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. ఒకరి పట్ల ఒకరికి మొదట్లో ఉండే ఆకర్షణను ఇష్టంగా మార్చుకోవడం ద్వారా, ఒకరి అవసరాలను మరొకరు పట్టించుకోవడం ద్వారా ఆకర్షణను నిలుపుకోవచ్చు. అది సెక్స్ జీవితానికి మంచి దారులు వేస్తుంది.
భోజనానికి ముందూ తర్వాతా...
సెక్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని పలు పరిశోధనల్లో తేలింది. సెక్స్ చేసే సమయంలో శరీరంలోని టాక్సిన్స్ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల వ్యక్తిలో ఆరోగ్యం తొణికిసలాడుతుంది. సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత రాత్రి పూట దంపతులు సెక్స్కు సిద్ధపడుతారు. అయితే, సెక్స్లో అదరగొట్టాలంటే మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇవి తీసుకోవచ్చు...
అల్పాహారం,పండ్ల రసాలు ఎనర్జీ డ్రింక్స్ వంటివి రతిక్రీడకు ముందు తీసుకోవచ్చు. కడుపారా భుజించిన వెంటనే వెంటనే శృంగారంలో పాల్గొనకూడదు. మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి వీలుగా పనిచేస్తుంటాయి. తిన్నవెంటనే శృంగారంలో పాల్గొంటే త్వరగా అలిసిపోతారు. సెక్స్ను పూర్తి స్థాయిలో అనుభవించలేరు. మితంగా తినేవారు, డైట్ ఫాలో అవుతున్న వారు తిన్న తర్వాత రతిక్రీడలో పాల్గొనడం చాలా మంచిది.
కొంత గ్యాప్ ఇవ్వాలి...
రతిక్రీడ ముగిసిన వెంటనే కూడా తినకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలూ రిలాక్స్ స్టేజికి వచ్చిన తర్వాత తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేదంటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్స్పెస్ మ్యాగజైన్స్ వారు నిర్వహించిన సర్వే ప్రకారం, మగవారిలో 41శాతం మంది తినడానికి ముందే సెక్స్ను ఇష్టపడితే మహిళల్లో 61శాతంమంది తిన్న తర్వాతే ఇష్టపడుతారని తేలింది.
ప్రతిరోజూ శృంగారం
దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందుకు తగిన కారణాలున్నాయి. శృంగారం కూడా ఒక వ్యాయామం. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్ సంతరించుకుంటుంది. శరీర కణాలకు ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్ చేసినట్లేనని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం
పనిలో అలసిపోయి ఇంటికి చేరుకున్న వెంటనే మనకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రోజంతా శ్రమలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని అంటున్నారు. శృంగారానికి ముందు ఆకుకూరలు, చేదుగా వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. శృంగారానికి మందు ఒక గ్లాస్ బాదం మిల్క్ తాగడంవల్ల మంచి శక్తి లభిస్తుంది. ఫిగ్స్ లేదా అత్తిపండులో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా తీసుకుంటే మంచిది. డార్క్ చాక్లెట్, ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్మిలన్, దానిమ్మ, బొప్పాయి, కర్జూరం వంటి ఫ్రూట్స్, సలాడ్రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ఇటువంటి సాహిత్యం చదవాలి..
రొమాంటిక్ పుస్తకాలు, నవలలు చదవడం అలవాటు చేసుకోవాలి. వాటిలోని పాత్రలను మనకు ఆపాదించుని మనసులో మనకు మనమే సెక్స్లైఫ్ గురించి ఓ ఆలోచన ఏర్పరుచుకోవచ్చు. రోమాంటిక్ సినిమాలు, వీడియోలు చూడవచ్చు. దానివల్ల శృంగారసమయంలో మంచి ఆలోచనలు వచ్చే అవకాశాలున్నాయి.
శృంగారం తర్వాత నిద్ర...
రతిక్రీడ సాగించే క్రమంలో శరీరం సాధారణంగా రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. భయాలు, ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోవడం వల్ల శృంగారం చేసిన వెంటనే మగవారు నిద్రపోతారు. శృంగారం సమయంలో మగవారి మెదడులో కొన్ని రకాల కెమికల్స్ విడుదల అవుతాయని చెబుతున్నారు. ప్రొలాక్టిన్, వాసోప్రెస్సిన్, నైట్రిక్ ఆక్సిడ్ , సెరటోనిన్, ఆక్సిటోసిన్ విడుదల కావడంవల్ల మగవారికి నిద్రపోవాలనిపిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
మాంసాహరం తినే మహిళలు...
మాంసాహారం తీసుకునే మహిళలు శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పరిశోధనల్లో తేలింది. శాకాహారం తీసుకునే వారిలో జంక్ లోపించి వారిలో టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శాకాహారం తీసుకోవడం వల్ల సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మాంసాహారం తీసుకునే వారిలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని తెలిపారు, కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో సెక్స్ సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందని, భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలింది.