స్త్రీతో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదు. మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు.ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యేవారికి మాత్రమే. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30 రోజులకు, ఇంకొందరు35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం రతిలో పాల్గొనాలి.ప్రతి నెలా కరెక్ట్‌గా ఒకే రోజుకి మెన్సస్ కానివారు మెన్సస్ అయిన మొదటి రోజులకంటే, మెన్సస్‌కు ముందు 11 రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే వారికది సేఫ్ పీరియడ్‌గా భావించవచ్చు.