•  

సెక్స్: మగాళ్లలో సెక్స్ సామర్థ్యం తగ్గిందంటే...

పురుషుల సెక్స్ సామర్థ్యం గురించి తరుచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. సెక్స్ సామర్థ్యం ఎక్కువగా ఉన్న పురుషులు తన జీవిత భాగస్వామిని ఎక్కువగా సంతృప్తి పరచగలుగుతాడు. సంభోగంలో స్త్రీని సంతృప్తి పరచాలని ప్రతి పురుషుడూ కోరుకుంటాడు.

సెక్స్ సామర్థ్యం తగ్గడానికి వివిధ కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి కలిగే కలిగే అలసట, పనుల్లో చిరాకు వంటి కారణాల వల్ల పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. సెక్స్ పట్ల విముఖత కూడా ఏర్పడే అవకాశం ఉంది. పడక గదిలో భాగస్వామితో రతిక్రియ సాగించే సమయంలో నిత్య జీవితంలో ఆందోళనలు, అలసట సెక్స్‌లో సామర్థ్యం లోపించి జీవిత భాగస్వామిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేడు.

కొన్ని సార్లు టీనేజర్లలో కూడా సెక్స్ పట్ల ఆసక్తి నశించి, సామర్థ్యం తగ్గిపోతుంది. మగవారిలో సెక్స్ సామర్ధ్యం తగ్గటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

ఆహారం అలవాట్లు

ఆహారం అలవాట్లు

ఆహారం వ్యక్తి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, ఎక్కువ శాతంలో జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల మీ సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతుందని నిపుణులు తేల్చారు. ఎక్కువగా మందులు వాడేవారు సంభోగం జరిపే సమయంలో త్వరగా నీరసించిపోతారని తేలింది.

మద్యపానం మరియు ధూమపానం

మద్యపానం మరియు ధూమపానం


అతిగా మధ్యపానం చేయడం వల్ల స్మోకింగ్ వల్ల కూడా సెక్స్ సామర్ధ్యం త్వరగా తగ్గిపోతుందని నిపుణులు తేల్చారు. అని పురుషునిలోని మీ వీర్య కణాల్ని నాశనం చేస్తాయి.వ్యాయామం చేయటం వల్ల పురుషుల్లో రక్త ప్రసరణ బాగా జరిగి చక్కటి శక్తి సామర్ధ్యాలు మీరు పొందుతారు.

భాగస్వాములను నిర్లక్ష్యం చేయడం...

భాగస్వాములను నిర్లక్ష్యం చేయడం...

చాలా మంది పురుషులు తమ భాగస్వాముల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంాటరు. దీని వల్ల వారి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం దెబ్బ తినే ప్రమాదం ఉంది. అది శృంగార జీవితంపై కూడా ప్రభావం వేస్తుంది. దానివల్ల ఆందోళన, ఒత్తిడి పెరిగి శీగ్ర స్కలన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

అవసరమైనవి ఇవీ...

అవసరమైనవి ఇవీ...

పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెరిగి జీవిత భాగస్వామిని సంతృప్తి పరచాలంటే - సెక్స్ ఎక్కువ సేపు చేయటం, తగినంత వీర్యం ఉత్పత్తి, స్కలన శాతాన్ని పెంచటం, ఆందోళన, ఒత్తిడి, కంగారు తగ్గించటం, పూర్తి స్థాయి సంతృప్తి పొందటం కొన్ని క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అనుసరిస్తే జీవిత భాగస్వామిని రతిక్రీడలో సంతృప్తి పరచగలరు.

 

English summary
Men should take care of his heath to protect the sexual potency and to satisfy his sexual partner.
Story first published: Friday, May 12, 2017, 15:42 [IST]

Get Notifications from Telugu Indiansutras