మన దైనందిక జీవితం లో కొన్ని విషయాలను ఎవరితో చర్చించాలో అర్ధం కాదు. ఒకవేళ చర్చిస్తే ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో అనే భయం వెంటాడుతుంది. ముఖ్యం గా శృంగారానికి సంభందించిన విషయాలను చర్చించాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు(సోషల్ మీడియా) ప్రజల్లోకి విస్తృతం గా చేరిపోవడం తో శృంగారానికి సంబంధించిన విషయాలను, అనుమానాలను చాలా సులువుగా నివృత్తి చేసుకోగలుగుతున్నారు.
కొంతమంది పురుషులకు ప్రొదున్న లేవగానే వారి పురుషాంగం గట్టిపడి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? ఇది ఏమైనా లోపమా ? లేక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయానికి సంభందించి కొంతమంది నిపుణులు పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రొదున్న లేవగానే ఎందుకు పురుషాంగం గట్టి పడుతుంది ?
మాములుగా యుక్తవయస్సు లో ఉన్న అబ్బాయిలు లేదా మంచి వయస్సు లో ఉన్న పర్సుషుల్లో నిద్రలేవగానే పురుషాంగం గట్టి పడటం అనే లక్షణం ఎక్కువగా కనపడుతుంటుంది. వయస్సు రీత్యా వారిలో హార్మోన్లు చురుకుగా ఉండటం వల్ల పురుషాంగం గట్టి పడుతుంది. నిద్రలో ఉన్నప్పుడు కూడా మూడు నుండి ఐదు సార్లు ఆయా వ్యక్తులకు తెలియకుండానే ఈ ప్రక్రిక జరుగుతుంది. అప్పుడప్పుడు నిద్ర లోనే స్కలిస్తారు. వయస్సు పెరిగే కొద్దీ హార్మోన్లు ల్లో చురుకుదనం తగ్గిపోవడంతో క్రమేపి వారిలో ప్రొదున్నపూట పురుషాంగం గట్టిపడటం తగ్గుతుంది.
అపోహలు:
కొంత మంది పురుషుల్లో ఇలా ఎందుకు గట్టి పడుతుందో తెలియక, వారిలో అయోమయం నెలకొంటుంది. రాత్రి పూట కలలో శృంగార కోరికలు ఎక్కువ అవ్వడం వల్లనే నిద్ర లేవగానే ఇలా జరుగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ ఆ అపోహలన్నీ తప్పు అని చెబుతున్నారు నిపుణులు. మరి కొంత మంది నిపుణులు శరీర ప్రక్రియలో భాగం గా పురుషాంగం లో ఆక్సిజెన్ ని నింపాలనే ఉద్దేశ్యంతోనే మెదడు రక్తాన్ని పురుషాంగం లోకి పంపడం జరుగుతోందని, అందుమూలంగానే ఇలా జరుగుతుందని చెబుతున్నారు.
రాత్రి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ? మిగతా రోజులో ఎందుకు ఇలా జరగదు ? :
మనం నిద్ర లేచినప్పటి నుండి మన మెదడు దైనందిక జీవితం లో భాగం గా వివిధ విషయాల గురించి, చేయాల్సిన పనుల గురించి చురుకుగా ఆలోచిస్తుంటుంది. పదిమంది తో కలిసి తిరిగి, మాట్లాడి, పనులు చేసే సమయం లో పురుషాంగం గట్టి పడకుండా ఉండటానికి మనకు తెలియకుండానే మన మెదడు కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. రాత్రి అవ్వగానే మనస్సు కు స్వేచ్ఛ దొరుకుతుంది. మెదడు శరీరానికి హాయ్ ని ఇచ్చేలా తన సహజ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందు వల్లనే మనకు తెలియకుండానే, రాత్రి పుట నిద్రలోను, ప్రొదున్న నిద్ర లేచిన వెంటనే పురుషాంగం గట్టి పడటం జరుగుతుంది.
పురుషాంగం ఉదయం పూట గట్టిపడటం లాభమా ? నష్టమా ? :
పురుషాంగం ఉదయం పూట గట్టిపడటం వల్ల వచ్చే ప్రమాదం ఏమి లేదు. మీరు ఒక వేళ యుక్త వయస్సు లో గాని లేక మంచి వయస్సు లో ఉండి, తరచూ ఇలా ప్రొదున్న పూట పురుషాంగం గట్టిపడకపోతే, శృంగార ఆరోగ్య విషయం లో మీలో ఎదో లోపం ఉందని అర్ధం. ఇలాంటి సమయం లో ఒత్తిడిని తగ్గించుకొని, క్రమం తప్పకుండా వ్యాయాయం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది.