•  

శృంగారం లో పాల్గొంటే నిజంగానే స్త్రీల వక్షోజాలు సైజు పెరుగుతుందా?

మహిళల శరీరంలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన శరీరభాగాల్లో వక్షోజాలాది (స్తనాలది) ప్రత్యేకమైన స్థానం. మహిళల అందాన్ని చూపుతిప్పుకోనివ్వకుండా చేయటం లో వక్షోజాల పాత్ర ఎంతో కీలకం.మహిళలు కూడా తమ రొమ్ములను అందంగా, బిగుతుగా ఉంచుకోవడానికి వాటి పై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తుంటారు. శృంగార సమయంలో పురుషుడు మహిళల వక్షోజాలను చూసి తీవ్ర ఉద్రేకానికి లోనవుతాడని,వక్షోజాలతో పురుషుడు కామకేళి సమయం లో చేసే ప్రక్రియల వల్ల స్త్రీలు కూడా మంచి ఆనందాన్ని,అనుభూతిని పొందుతారని ఎంతో మంది నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయం.

Does Sex Increase Breast Size In Women
 

అందం,సుఖం,ఆనందం ఇలా ఎన్నో రకాల శారీరిక , మానసిక ఉల్లాసాన్ని అందించే అంశాలతో ముడిపడివున్న స్త్రీల వక్షోజాల పై కొన్ని అపోహలు,అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు వక్షోజాల అందాన్ని పెంచుతూ ,వాటి అందం చెడిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కొంత మంది నిపుణులు వ్యక్తం చేసిన అనుభవాలతో కూడిన అభిప్రాయాల సమ్మేళనాన్ని తెలియజెప్పే చిన్న ప్రయత్నం.

యుక్తవయస్సు తో పాటు నెలసరి సమయంలో కలిగే మార్పులు

మహిళలు రజస్వల అయిన తరువాత యుక్తవయస్సు నుండి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల్లో భాహ్య ప్రపంచానికి కనపడే మార్పుల్లో మొదటిది వక్షోజాల పెరుగుదల.నెలసరి కి ముందు వక్షోజాలలో నీరు చేరటంతో పాటు కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల కొద్దిగా వాటి పరిమాణం పెరిగి, మళ్ళీ నెలసరి అయిపోయిన తరువాత యథాస్థితికి చేరుకుంటాయట.

Does Sex Increase Breast Size In Women3
 

శృంగారం లో పాల్గొనటం వల్ల స్త్రీ ల వక్షోజాల(స్తనాల) లో పెరుగుదల కనిపిస్తుందా ?

చాలా మంది లో ఉన్న అనుమానపు అపోహలు ఏంటంటే మహిళల రొమ్ములు పరిమాణం ,ముందుటికంటే పాల్గొన్న తరువాత పెరుగుతాయని చాలా మంది బలంగా విశ్వసిస్తారు.కానీ వైద్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన వాటి పరిమాణం పెరగవని ,శృంగారంలో పాల్గొనటం వల్ల రొమ్ముల పరిమాణం విపరీతంగా పెరుగుతాయనే వార్తలన్నీ వట్టి అపోహల్ని చెబుతున్నారు.వాటిని ఒక క్రమ పద్దతిలో చాలా రోజులు పాటు శృంగార సమయం లో మర్దన చేస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. శృంగారంలో పాల్గొనే సమయంలో శరీరంలో కలిగే ఉద్రేకంవల్ల వక్షోజాల ఉండే అతి మృదువైన కండరాలు ,బాగా ఉత్తేజానికి లోనుకావడంతో మామూలుకంటే శృంగారం చేసే సమయంలో వక్షోజాల పరిమాణం 20 నుండి 25 శాతం మేర పెరిగి,రతిక్రీడ అయిపోయిన తరువాత మళ్ళీ యథాస్థితికి చేరుకుంటాయట.వక్షోజాల లో ఉండే కండరాలు చాలా సున్నితమైనవని, వాటిని ఇష్టమొచ్చినట్లు మొరటుగా శృంగార సమయం లో ఒత్తేస్తే వాటి సహజ సౌందర్యం పోయి ,వాటి బిగుతుని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

గర్భ నిరోధక మాత్రల వల్ల రొమ్ముల పరిమాణం పెరుగుతుందా?

శృంగారం లో మధురానుభూతిని పొందటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా చాలా మంది రతికేళి లో పాల్గొంటున్నారు.ఇలా పాల్గొన్న తరువాత గర్భం దాల్చకుండా ఉండటానికి స్త్రీలు ఈమధ్య కాలంలో ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు.ఈ మాత్రల తయారీకి వాడే పదార్థాల్లో కొన్ని , మహిళల శరీరంలోని హార్మోన్ల పై ప్రభావం చూపుతాయట.దీని వల్ల పక్షోజాల పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Does Sex Increase Breast Size In Women2
 

మరి పెళ్లి అయిన మహిళల వక్షోజాల సైజు ఎందుకు అంతలా పెరిగిపోతాయి?

చాలా మంది మహిళలు పెళ్లి అయిన తరువాత ఒక రకమైన మానసిక ఆనందానికి లోనవుతారట.ఈ సమయం లో తన భర్త తో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ,అతనితో కలిసి ఆహరం,చిరుతిళ్ళు తినడానికి ఇష్టపడతారట.భర్త ఇంట్లో లేన్నప్పుడు ఏమి చేయాలో తోచక ఎక్కువ మంది ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి ఇష్ట పడతారట.ఇవ్వని మహిళలు కావాలనే చేయకపోయినా, ఆలా చేసేస్తుంటారట. వీటికి తోడు వ్యాయామం కూడా సరిగ్గా చేయకపోవటం తో శరీరం బరువు బాగా పెరిగి పోవటం తో, వక్షోజాల పరిమాణం కూడా బాగా పెరిగి, వాటి సహజ అందం కోల్పోయి బాగా సాగిపోతాయట.క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే స్త్రీలు ,వక్షోజాల అందాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మహిళల రొమ్ములలో అనుకోని మార్పులు ఏవైనా అనూహ్యంగా సంభవిస్తే వెంటనే వైద్యున్ని కలవటం ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు.

Read more about: love, romance
English summary
Does sex increase breast size in women? Well, is that a myth then? Read on to know.
Story first published: Tuesday, August 8, 2017, 14:46 [IST]

Get Notifications from Telugu Indiansutras