పడకగదిలో మగాడు ఎప్పుడూ రెచ్చిపోవాలని చూస్తుంటాడు. శృంగారంలో వారి ప్రవర్తన కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది కూడా. శృంగార సమయంలో పరుషుల ప్రవర్తనను వివరించడం కాస్తా కష్టమైన పనే.
మగాడి మనసును ఎరిగి మహిళ వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషుడికి కాస్తా అహం ఎక్కువగా ఉంటుంది. రతిక్రీడ సమయంలో అతని అహం దెబ్బ తినకుండా చూడాలి.
అదే సమయంలో అతనికి కావాల్సిన రీతిలో వ్యవహరిస్తే మహిళలకు కూడా శృంగారంలోని తీపి అనుభవంలోకి వస్తుంది.
అతనిపై ఒత్తిడి ఉంటుంది
రతిక్రీడ జరిపే సమయంలో పురుషుడిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. పెళ్లి తర్వాతనే చాలా మహిళలకు శృంగారం అనుభవంలోకి వస్తుంది. స్వేచ్ఛగా ఉండే మహిళల వల్ల పురుషుడు సమస్యను ఎదుర్కుంటాడు. రతిక్రీడలో పురుషుడు సమస్యను ఎదుర్కుంటే అతన్ని స్త్రీ నిందించడం సరి కాదు. అతని ఈగోను దెబ్బ తీయకూడదు. సమస్యను సరైన పద్ధతిలో పరిష్కరించుకోవడానికి మహిళలు ప్రయత్నించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకుని అతన్ని అవమానించకూడదు. నవ్వకూడదు కూడా.. బాగుందని నటిస్తే అతను తృప్తి చెందుతాడు.
మగతనానికి ప్రతీకనా....
సెక్స్‌లో మగతనాన్ని ప్రదర్శించాలని పురుషుడు ఉవ్విళ్లూరుతుంటాడు. లేదంటే అలా అనుకుంటూ ఉంటాడు. మహిళను తాను సంతృప్తిపరగచగలననే ఈగో కూడా అతనికి ఉంటుంది. మహిళ తనను సూపర్ హీరో అనుకోవాలని ఆశిస్తాడు. సెక్స్ తర్వాత తనను తాను సూపర్ హీరో అని కూడా అనుకుంటాడు. తాను సెక్స్‌లో సంతృప్తి పడితే అతన్ని మహిళ పొగడాల్సి ఉంటుంది. ప్రోత్సాహం ఇస్తే అతను మరింత రెచ్చిపోతాడు. అంతే కాకుండా అదో వినోదంగా మారుతుంది. పూర్తిగా భావప్రాప్తి కాకున్నా మహిళ తన పురుషుడితో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు గానీ బాగానే ఉందని చెప్తే మంచిది.
పురుషుడిలో తొందర ఎక్కువ....
పురుషుడు శృంగారానికి తొందరపడుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు పని కానిచ్చేద్దామా అన్నట్లు ఉంటాడు. నీతో సెక్స్ చేయాలని ఉందనే కోరికను మహిళ వెల్లడించాల్సి ఉంటుంది. మీరు సెక్స్‌ను కోరుకున్నప్పుడు అతను నిరాకరిస్తే అతన్ని వదులుకోవడం మంచిది. ఇది డేటింగ్ సమయంలో చేయాల్సిన పని. పెళ్లి తర్వాతనైతే కాస్తా బుజ్జగించాల్సి ఉంటుంది.
బరువు గురించి ఆలోచించరు....
పురుషులు స్త్రీల మాదిరిగా బరువు గురించి లావు గురించి ఆలోచించరు. అయితే, వారికి సంబంధించిన ఇమేజ్ ఇష్యూ వారికి ఉంటుంది. సాధారణ శారీరక స్థితి పట్ల వారు జాగరూకతతో ఉంటారు. మహిళల మాదిరిగానే దాదాపుగా వారు బెడ్రూంలో ఆలోచిస్తారు. అందువల్ల నువ్వు ఆకర్షణియంగా ఉన్నావని ప్రేమను కనబరుస్తూ మాట్లాడితే అతను మహిళ పట్ల ఎక్కువ శ్రద్ధతో ఉంటాడు.
మోసాన్ని సహించడు...
పురుషులు మహిళలు మోసం చేస్తే సహించరు. వారు అన్ని వేళలా విధేయతను కోరుకుంటారు. విశ్వసనీయత అనేది బంధాన్ని గట్టి పరుస్తుంది కూడా. మిత్రుల ముందు, సహోద్యోగుల ముందు మహిళలు తమ పురుషుడికి మద్దతుగా నిలబడాల్సి ఉంటుంది. తమ పురుషుడు చాలా భద్రంగా ఫీలయ్యే విధంగా మహిళలు ప్రవర్తించాల్సి ఉంటుంది.