•  

ప్రేమలో కామం కూడా ఉంటుంది

Link between Love and Sex
 
స్నేహం, కామం కలిసిన మిశ్రమ రూపాన్నే ప్రేమ అంటారని హెవలాక్ ఎల్లీన్ నిర్వచించాడు. ఇది ఆకర్షణతో కూడిన ఒకానొక అనుభూతి. ఇది ఆత్మార్పణతో నిండి ఉంటుందని అంటాడు. అనురాగం, గౌరవం, భక్తి, సానుభూతి, సంరక్షక భావాలు - వీటిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఇవి అందరికీ స్పష్టంగా కనిపించేవే. పిల్లల్లో కూడా ఇవి ఉంటాయి. కానీ చిన్న వయస్సులో వీటిని తల్లిదండ్రుల మీద, స్నేహితుల మీద, పెంపుడు జంతువుల మీద చూపిస్తారు.

యవ్వనం వచ్చే సరికి అవే తమ వయస్సుకు చెందిన స్త్రీపురుషుల వైపు పరుగెడతాయి. ఈ అనురాగంలో కొంత వరకు గౌరవం, భక్తి ఇమిడి ఉంటాయి. అయితే వీటి వెనక అవ్యక్తమైన కామవాంఛ కూడా ఉంటుందట. వీటిని కలిపే ప్రేమ అంటాం. కేవలం కామం మీద మాత్రమే ఆధారపడిన వివాహం దుఖ్కాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

English summary
Experts say that love is mixed with friendship and sexual desire. Marriage for only to fulfill sexual desire without friendship will not bring happiness.
Story first published: Saturday, April 23, 2011, 15:32 [IST]

Get Notifications from Telugu Indiansutras