ఇకపై 'కొత్త ముసలి వయసు' పైనే మాట్లాడాల్సివుందని ఆ యూనివర్శిటి ప్రొఫెసర్ ఇంగ్ మార్ స్కూగ్ తెలిపారు. దానికి కారణం 1970 లలో పుట్టిన వారికి సెకండరీ విద్యా స్ధాయి గతంలోని 14 శాతం నుండి 40 శాతానికి పెరగటమేనన్నారు. ఈ విద్యా స్ధాయి కారణంగా ఇప్పటి 70 ఏళ్ళ వృధ్ధులలో ఈ పరిస్ధితి ఏర్పడిందని, వీరు సెక్స్ పరంగా చాలా చురుకుగా వున్నారని, నపుంసకత్వం లాంటి సెక్స్ సమస్యలుకరూడా అప్పటిలో వలే లేవని, 1970లలోని వృధ్ధులకంటే కూడా నేటి తరం వృధ్ధులు బయట బాగా తిరుగుతున్నారని పరిశోధన తెలిపింది.
వృధ్ధులు తమ పొరుగువారితో బాగా మాట్లాడటం, గతంలోని మతిమరపులు లేకపోవటం, మనోవేదనలు లేకుండటంగా కూడా వుండి హాయిగా వుంటున్నారని తెలిపింది. ఈ శతాబ్దం చివరకు యూరప్ ఖండంలో సగటు జీవిత కాలం 100 సంవత్సరాలకు కూడా చేరే అవకాశాలున్నాయని అంచనాగా స్టడీ తెలుపుతోంది.