ఈ సమస్యల ప్రభావం మహిళల విషయంలో మరో 8 శాతం అధికంగా కూడా వుంటుందిట. పురుషులైతే, నపుంసకత్వం, త్వరగా భావప్రాప్తి కలగటం, అంగ స్తంభన కాకపోవటం మొదలగు అంశాలలో 6 శాతం అధికంగా ఛీట్ చేయటానికే చూస్తారట. అయితే పురుషులు ఎంత ఆందోళన చెందినప్పటికి, వారి గురించి తెలియని కొత్త వారితో సంభోగం జరిపేటపుడు ప్రశాంతంగానే సెక్స్ చేయటానికి ప్రయత్నిస్తారని కూడా అధ్యయనం తెలిపిందని ఇండియానా యూనివర్శిటీ కి చెందిన రీసెర్చర్ క్రిస్టన్ మార్క్ వెల్లడించినట్లు డైలీ మెయిల్ పత్రిక తెలుపుతోంది.
రీసెర్చర్లు 506 మంది పురుషులను, 416 మంది మహిళలను సర్వే చేశారు. వీరి సగటు వయసు 31గా వుంది. వీరిలో సగం మంది వివాహితులే. వీరినందరిని వారి సెక్స్ ప్రవర్తన పై ప్రశ్నలడిగారు. భాగస్వామితో సంబంధాలు ఎలా వున్నాయని, ఎపుడైనా ప్రస్తుత భాగస్వామిని మోసగించటం జరిగిందా ? మొదలగు ప్రస్శలకు 23 శాతం పురుషులు 19 శాతం మహిళలు మరో వ్యక్తితో సెక్స్ చేశామని అయితే అది రహస్యంగా వుంచామని, తెలిస్తే భాగస్వామితో సంబంధాలు చెడిపోతాయని చెప్పారు. త్వరగా భావప్రాప్తి కలిగిందని చెప్పిన పురుషులు 4 శాతం తమ భాగస్వామిని మోసగించగా, మహిళలు అసలు భావప్రాప్తి తో సంబంధంలేకుండానే పురుషులను మోసగించినట్లు గా కూడా రీసెర్చర్సు తేల్చారు. సరి అయిన భావప్రాప్తి పొందని మహిళలు పురుషులను మోసగించే అవకాశాలు 2.6 నుండి 2.9 శాతం వరకు అధికంగా వుండగలవని స్టడీ చెపుతోంది. ఈ స్టడీ సెక్స్ వల్ బిహేవియర్ ఆర్చివ్స్ జర్నల్ లో ప్రచురించబడింది.