•  

తృప్తి అయిన సెక్స్ కు చక్కటి మాసాజ్!

Sex
 
నేటి వేగవంతమైన ప్రపంచంలో చాలామంది జంటలు సెక్స్ వద్దకు వచ్చేటప్పటికి తాము పూర్తిగా అలసి పోయామనో లేదా చాలినంత టైమ్ లేదనో సాకు చెప్పేసుకుంటారు. అయితే, ప్రతి దినం బోర్ కొట్టేస్తూ ఒకే రకంగా రతిక్రీడను కొనసాగిస్తూ వాయిదాలు వేసుకునే వారికి రతిక్రీడను మరో రకంగా కూడా ఆనందించవచ్చని నిపుణులు చెపుతున్నారు. సెక్స్ కు ముందు చేయాల్సిందల్లా చక్కని స్పర్శతో కూడిన బాడీ మాసేజ్ భాగస్వామికి ఎంతో హాయినిచ్చి తృప్తి అయిన సెక్స్ కార్యాన్ని ఆచరించేలా చేస్తుంది.

వేళ్ళతో శరీరంపై సుతి మెత్తగా స్పర్శ కలిగించటమనేది మనమంతా తల్లి గర్భంలో వున్నపుడు మన తల్లులు కలిగించిన స్పర్శ, తర్వాతి బాల్య దేశలో ఆటలలో తల్లి దండ్రుల, తోటి స్నేహితుల చేతి స్పర్శలు కూడా ఇదే రకమైన హాయి అయిన అననుభవాలను అందించాయి. ఆ తర్వాతి జీవితంలో ఈ స్పర్శలనే మనం సంబంధాలుగా మార్చుకుంటూ సెక్సువల్ చర్యలకు దిగుతున్నాం. సెక్సువల్ మాసేజ్ అనేది ఒక అసాధారణ సన్నిహితాన్ని చూపిస్తూ చక్కటి రిలాక్సేషన్ మాత్రమే కాకుండా ఒకరిపై మరి ఒకరికి అనురాగాన్ని సైతం కలిగిస్తాయి అంటారు హైదరాబాద్ రిలేషన్ షిప్ నిపుణులు రత్నా వోరా.

వివాహమైన వారైనా, లేక దీర్ఘకాల సంబంధం వున్న వారైనా లేక అప్పటికపుడు కొత్తగా ఒకరి కొకరు కావాలనుకున్నవారైనా సరే మీ భాగస్వామికి సున్నితంగా చేసే శారీరక మర్దనం లేదా బాడీ మాసేజ్ మంచి నమ్మకాన్ని కలిగించటమే కాక, సమయాన్ని ఇద్దరూ కలసి బాగా ఆనందించినట్లవుతుందంటారు.

కొద్దిపాటి వేడి కల సుగంధభరితమైన ఏదేని ఒక నూనెతో వీపు, తల సున్నితంగా వేళ్ళతో చేసే మర్దన ఇచ్చే అనుభూతి, భాగస్వామికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ఈ సౌఖ్యం సాటి వేరే ఏ ఇతర బహుమానంకి కూడా రాదని 32 సంవత్సరాల దీప్ శిఖా రాయ్ అనే ఒక బూటిక్ మహిళ వివరిస్తోంది. ఒకరికొకరు అంటుకు తిరిగే ప్రియులు, ఒకరినొకరు ముట్టుకోకుండా తిరిగే వారికంటే కూడా ఎక్కువ ఆనందిస్తారట. చిన్నపాటి చర్యలైన, చేయి పట్టుకోడం, సెక్స్ సమయంలోనే కాక ఇతర సమయాలలో కూడా ఒకరినొకరు ముట్టుకోడం లాంటివి భాగస్వామికి ఎంతో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి. మాసేజ్ అనేది మీ భాగస్వామికి మీ భావనలు తెలియజేయటం మాత్రమే. ఈ రకమైన మాసేజ్ ప్రక్రియలో నిపుణులైతే మీ సంబంధాలు హాయిగా కొనసాగినట్లే నంటారు కి్లనికల్ సైకాలజిస్టు డా. రిషబ్ భాత్రా.

English summary
Undeniably, lovers who touch and touch share a much closer bond than those who don't. The simple act of hand holding, regular cuddling outside the sexual ambit builds an eternal bond between two people. "Couples who habitually engage in non-sexual, physical contact miss their partners more when they are apart. Massage is the ultimate way of conveying your feelings to your partner.
Story first published: Monday, August 15, 2011, 15:12 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more