సంభోగం గుండె పోటును అధికం చేసే అవకాశాలను ఇవ్వదు. ఒక్క ఇరవై నిమిషాలపాటు నడిస్తే గుండెపై ఎంత ప్రభావం వుంటుందో రతిక్రీడ చేస్తే గుండెపై అంతే ప్రభావం వుంటుంది. సంభోగంలో ఉద్రేకం పొందే కొలది శ్వాస అధికమవుతుంది, గుండె కొట్టుకోడం అధికమవుతుంది, బి.పి. కూడా కొద్దిపాటిగా పెరుగుతుంది. అంతేకాదు, మీ చర్మం కూడా రక్తం వడిగా ప్రవహించి ఎరుపెక్కుతుంది. సెక్సు ఆరాటం పెరిగే కొలది హార్టు కోట్టుకోడం, బి.పి. లు పెరుగుతూనే వుంటాయి. స్కలనం అయిందంటే చాలు ఒత్తిడి అంతా మటుమాయం. రతి చర్యలో గుండె నిమిషానికి 90 నుండి 145 సార్లు కొట్టుకుంటుంది. సెక్స్ కారణంగా గుండె పోటు వచ్చి మరణించిన వారు ఒక శాతం మాత్రమేనని రీసెర్చి చెపుతోంది. గుండె ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ ను సంప్రదించి రతిక్రీడ ఆచరించవచ్చు. అయితే, దీని ప్రభావం రోగి వయసు, భాగస్వామితోగల గత పరిచయం, గతంలోని అతని సెక్స్ నిర్వహణలపై ఆధారపడి వుంటుంది. డాక్టర్లు మీ శరీర సామర్ధ్యతను సెక్స్ సంబంధిత చర్యలపై పరీక్షలు జరిపి సురక్షితమా కాదా అనేది తెలుపుతారు.
గుండెకు చేయబడిన శస్త్ర చికిత్సకు తోడు వయసు పైబడటంతో కొంతమందికి రతిక్రీడపై కోరికలు వెనుకబడతాయి. అంతేకాక, గుండెకు సంబంధించి వాడే మందులు కూడా సెక్స్ కోర్కెలపై ప్రభావం తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చిన వారు విచారంగాను, మనోవ్యధతోను లేదా భయంగాను వుంటారు. ఎపుడూ అలసి నట్లుంటారు. నిద్రలేమి లేదా అధిక నిద్రలు కలిగి వుంటారు. గుండె పోటు తర్వాత ఆహారం తింటే ఎక్కువగా తిని బరువు పెరుగుతారు. లేదా తక్కువతిని డీలా పడతారు. ఈ పరిణామాలతో సెక్స్ పై వాంఛను కోల్పోతారు. ఈ మానసిక మార్పులను జీవిత భాగస్వామి ఎప్పటికపుడు కనిపెడుతూ వుండాలి. అలాగని వారికి కోరిక కలిగితే తిరస్కరించరాదు. గుండె జబ్బుల రోగి సైతం పరిధికి మించని ఆరోగ్యకరమైన సెక్స్ చర్యలు చేయవచ్చు.
ప్రతిదినం, అవసరమైన మందులు, ఆహారం, వ్యాయామం, విశ్రాంతి మున్నగునవి పాటించాలి. పొగతాగేవారైతే దానిని మానటం మంచిది. ఎంతో నెమ్మదిగా భాగస్వామి అవగాహనతో రతిక్రీడ పాటించాలి. ఎంతో విశ్రాంతి తర్వాత రతి క్రీడకు ఉపక్రమించవచ్చు. సాధారణంగా రాత్రి చక్కటి నిద్ర తర్వాత ఉదయం వేల సూచించదగినదిగా చెపుతారు. ఈ సమయంలో గుండెకు ఆహార ప్రక్రియ భాధ్యత ఉండదు కనుక సెక్స్ చేసినప్పటికి అధిక శ్రమ దానిపై పడదు. అయితే, సెక్సుకు ముందు వేసుకోవలసిన మందులు తప్పక వాడాలి. ఇక సెక్స్ లో ఆచరించవలసిన భంగిమలు పక్కగా గాని లేదా ముందు, లేదా వెనుక భాగంలో పడుకుని సౌకర్యవంతంగా చేయాలి. ఈ భంగిమలు గుండెపై ఎట్టి ఒత్తిడి చూపరాదు. శ్వాస తేలికగా తీసుకునేలా వుండాలి. గుండె కొట్టుకోడం వేగవంతమైనా లేదా, అపసవ్యంగా వున్నా, శ్వాసలో మార్పు గమనించినా, ఒత్తిడి లేదా నొప్పి, లేదా మెడ, చేతులు, దవడ భాగాలు, ఛాతీ లేదా పొట్టలలో అసౌకర్యం అనిపించినా డాక్టర్ ను సంప్రదించండి.
గుండె జబ్బు వచ్చినప్పటికి, రతిక్రీడ విజయవంతంగా ఆచరించగలిగితే అప్పటికే బాధపడ్డ అనేక శరీర భాగాలు మరోమారు ఉత్తేజితమవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది, మీపై మీకు మరింత విశ్వాసం పెరుగుతుంది. అన్నిటిని మించి భాగస్వామితో రతిలో చక్కటి తృప్తి దొరికి జీవితం సాదారణ స్ధితికి వచ్చి ఆనందంగా కూడా వుంటుంది.