ఇక్కడ నుంచి నలభై ఏళ్ళు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా సహజం. ఎందుకో, అలసట, నిరుత్సాహం, దిగులు. ఇందుకు మానసిక సమస్యలే కారణమనుకునే చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి మానసిక సమస్యలేవీ లేకున్నా ఇది తప్పదు. శరీరంలో టెస్టోస్టిరాన్ హర్మోన్ లోపాలు పురుషులను ఈస్ట్రోజన్ హార్మోన్ లోపాలు మహిళలను సతమతం చేస్తాయి.
ఈ హార్మోన్లన్నీ శరీరంలో తయారయ్యే రసాయనాలే. ఇవి లైంగిక హార్మోన్లు. టెస్టోస్టిరాన్లు పురుష లక్షణాలను కలిగిస్తే, ఈస్ట్రోజన్ హార్మోన్లు స్త్రీ లక్షణాలను కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తాయి. పురుషుల అంగ స్తంభనలకు, వీర్య కణాల ఉత్పత్తికి ఈ హార్మోన్లే మూలం. అలాగే ప్రొస్టేట్ కణాల ఉత్పత్తిలో కూడా ఈ హార్మోన్ల పాత్ర ఉంది. ఎముకలు, కండరాల ధృఢత్వానికి ఈ హార్మోన్లే ఆధారం.
శృంగార వాంఛను కలిగించేవి ఈ హర్మోన్లే. అయితే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే సమస్యలు మొదలలవుతాయి. ఇలా తగ్గడాన్ని హైపో గోనాడిజం అంటారు. 40 ఏళ్ళ తరువాత క్రమంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతూ వెళుతుంది. ప్రతి ఏటా ఒక శాతం ఉత్పత్తి తగ్గుతూ 70 ఏళ్ళు వచ్చేసరికి ఈ ఉత్పత్తి 30 శాతానికి పడిపోతుంది. ఇందుకు భిన్నంగా కొందరిలో ఉత్పత్తి చాలా వేగంగా తగ్గిపోతుంది.