శృంగారానికి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందా? ఆ సమయంలో మీలో కామవాంఛలు పెచ్చరిల్లలేదా? ఒకవేళ కలిగితే మీ శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి? సెక్స్ లేకపోయినా ఉండగలమని అనుకుంటున్నారా? అసలు సెక్స్ చేయకపోతే నష్టం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలు చాలా మంది ఉదయిస్తాయి.
తమలో ఉదయించే ప్రశ్నలకు జవాబులు పొందడానికి ఇతరులను అడిగి తెలుసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అసలు సెక్స్ అవసరం గురించి పరస్పరం చర్చించుకునేందుకే ఇష్టపడరు. అయితే మనిషి మనిషికి సెక్సుకు సంబంధించిన కోర్కెలు భిన్నమైనవిగా ఉంటాయి.
సెక్స్ అనేది శరీరానికి కావలసిన అవసరం. అయితే, తీవ్రమైన పని ఒత్తిడి ఉండడం వల్ల కొన్నిసార్లు దృష్టంతా అటువైపు ఉండడం వల్ల కామవాంఛలు కలగకపోవచ్చు. కానీ, సాధారణంగా ఏదో సమయంలో అటువంటి కోరిక బుసలు కొడుతూనే ఉంటుంది. సెక్స్ కావాలని శరీరం వివిధ పద్ధతుల్లో చెబుతోంది.
సెక్స్ కావాలని శరీరం చెబుతుంది..
అతిగా మానసిక ఆందోళనగా ఉన్నట్లు అనిపించడం అనేది శృంగారాన్ని కోరుతున్నట్లుగా భావించాల్సి ఉటుంది.
సెక్స్ కావాలని శరీరం చెబుతుంది..
మైగ్రేన్, తెలియని చికాకు, ఒత్తిడి, ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కూడా శరీరం రతిక్రీడను వాంఛిస్తుందనేదానికి సంకేతాలు.
సెక్స్ కావాలని శరీరం చెబుతుంది..
తన భాగస్వామి పలకరిస్తే కొందరు కస్సుమని లేస్తుంటారు. చిరాకు పడుతుంటారు. అది రతిక్రీడలోని అసంతృప్తి తెలియజేయడమే కాకుండా సెక్స్ కావాలని దేహం కోరుతున్నదని చెప్పడానికి సంకేతం.
సెక్స్ కావాలని శరీరం చెబుతుంది...
పదేపదే సెక్స్ కోర్కెలు కలగడం వంటివన్నీ శరీరానికి సెక్స్ అవసరమని చెప్పేవే. సెక్స్‌కు సంబంధించిన ఆలోచనలు రావడం కూడా దాన్నే సూచిస్తుంది.
సెక్స్ కావాలని శరీరం చెబుతుంది...
ఎంతోకాలంగా లైంగిక సుఖానికి భాగస్వాములు దూరంగా ఉంటే ఇలాంటి చిక్కులు వచ్చిపడతాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు.