శృంగార క్రీడ జరిపే విషయంలో ప్రాచీనులు కొన్ని కట్టుబాట్లు పెట్టారు. ఉమ్మడి కుటుంబంలో దంపతుల శృంగారం ఇతరులకు కంటపడకూడదనే ఉద్దేశంతో నిబంధనలు పెట్టి ఉంటారు. అవి కాస్తా సంప్రదాయాలుగా మారి రసాస్వాదనకు ఆటంకంగా మారుతున్నాయి.
అందువల్ల రతిక్రీడ విషయంలో అపోహలను తొలగించుకోవడంతో పాటు తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. చిన్న పొరపాట్లే . అవి సరిదిద్దుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. భాగస్వామితో చర్చించి, వాటిని తిరిగి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మహిళలు సాధారణంగా తన పురుషుడి ఇష్టానిష్టాలను గుర్తించరు. లేదా పట్టించుకోరు. దానికి ప్రధాన కారణం సెక్స్ పట్ల వారికి ఉన్న అపోహలే.
పడకగదికి వెలుపల కూడా..
చాలా మంది స్త్రీలు రతిక్రీడ పడకగదికి మాత్రమే పరిమితమని అనుకుంటారు. పడకగదికి వెలుపల తన పురుషుడితో సెక్స్ చేయడానికి ఇష్టపడరు. పడకగదికి వెలుపల రతిక్రీడ జరపడం తప్పు అని అనుకుంటారు. అలాంటి భావన మహిళలు తొలగించుకోవడం అవసరం. బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి పడకగదికి వెలుపల రతిక్రీడను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త భంగిమలతో రతిక్రీడ జరిపితే ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు.
బ్లో జాబ్
దంపతుల ఇష్టానిష్టాలను బట్టి ఉంటుంది. చాలా మంది పురుషులు బ్లో జాబ్‌ను ఇష్టపడతారు. కొంత మంది మహిళలు ముఖరతి (బ్లో జాబ్) పట్ల విముఖత ప్రదర్శిస్తార. దాన్ని ఆసహ్యకరమైందిగా భావిస్తారు. ఆ భావనను తొలగించుకుని, బ్లో జాబ్‌ను రుచి చూడడానికి సిద్దపడాలి. అయితే, తన మహిళా భాగస్వామికి ఇష్టం లేకపోతే పురుషుడు బలవంతం చేయడం అంత మంచిది కాదు.
రాత్రిపూట మాత్రమేనా...
రాత్రిపూట మాత్రమే దంపతులు శృంగారం జరపాలనే ఓ ఆచారం అమలులో ఉంది. చాలా మంది మహిళలు దీన్నే నమ్ముతుంటారు. పగటి పూట రతిక్రీడను రాక్షసులు మాత్రమే సాగిస్తారనే దురుభిప్రాయం ఉంది. అయితే, రతిక్రీడకు ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదని గుర్తించాలి. ప్రతి పురుషుడికి ఉదయం వేళ అంగస్తంభన బలంగా జరుగుతుంది. మహిళలు దాన్ని వాడుకోవచ్చు. అది లైంగిక జీవితాన్ని మరింత మధరం చేస్తుంది.
కొరకడం, గీరడం
తమ పురుషులను దంతాలతో, చేతులతోకొరకడాన్ని, గీరడాన్ని కొంత మంది మహిళలు ఇష్టపడతారు. అయితే, చాలా మంది పురుషులకు అది ఇష్టం ఉండదు. నొప్పి కారణంగా పురుషులు దాని పట్ల విముఖత ప్రదర్శిస్తార. కొరకడం, గీరడం అనే చర్యలు సున్నితంగా ఉండాలి.