శృంగారం దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుందని విన్నాం. నిపుణులు కూడా అది నిజమని తేల్చారు. మరో విచిత్రమైన విషయం కూడా బయటపడింది. నిజానికి, మనిషికి సెక్స్ కోరికను తీర్చుకోవడం ఎంతైనా అవసరం. సెక్స్ కోరికలను అణచుకునే వారు ప్రశాంతంగా ఉండలేరని కూడా తేలింది.
కొత్త విషయం కాకపోవచ్చు గానీ, కాస్తా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఉద్యోగం బోర్ కొడుతుంటే, పనిచేయడంపై విసుగు జనిస్తే శృంగారంలో జోరు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
శృంగారంలో జోరు పెంచితే, ఉద్యోగంపైనా చేసే పనిపైనా ఆసక్తి పెరుగుతుందని ఆ అధ్యయనంలో తేలింది. అయితే, సెక్స్‌ను తనివితీరా అనుభవించినవాళ్లు ప్రశాంతంగా మాత్రం ఉంటారు.

ఏమీ అర్థం కావడం లేదా...
పని చేసే సమయంలో ఏమీ అర్థం కావడం లేదా, ప్రస్తుతం చేస్తున్న పని మీద విసుగు పుట్టిందా, అయితే మీరు సెక్స్లో పూర్తిగా మునిగిపోవాలని అంటున్నారు. సెక్స్ను ఎక్కువగా అనుభవిస్తే పనిపై ఆసక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మీరు చేసే పనిని కూడా ఎక్కువగా ఇష్టపడుతారట.

మంచి మూడ్....
ఎక్కువ సెక్స్ చేస్తే పని విషయంలో ఆసక్తి కనబరుస్తారని మేనేజ్మెంట్కు చెందిన ఓ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం తెలియజేస్తోంది. ఓరెగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 159 మంది వివాహితులను ఎంపిక చేసుకుని లైంగిక అభిరుచులపై అధ్యయనం చేశారు. ఇంటి వద్ద మస్తుగా సెక్స్ను ఆస్వాదించినవాళ్లు మర్నాడు పనిలో చాలా హుషారు ప్రదర్శించారని ఆ అధ్యయనంలో తేలింది.

పనిలో సంతృప్తి....
రాత్రిపూట సెక్స్లోని మజాను సంతృప్తిగా అనుభవించినవాళ్లు మర్నాడు పనిలో ఎక్కువగా నిమగ్నమైనట్లు, వారి ఉత్పాదక శక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు, పనిలో ఎక్కువ సంతృప్తిని పొందినట్లు, రోజంతా వారు ఉత్సాహంగా పనిచేసినట్లు ఆ అధ్యయనంలో తేలింది.

24 గంటల పాటు....
సెక్స్కు సంబంధించిన సానుకూల ప్రభావం 24 గంటల పాటు పనిచేసినట్లు కూడా ఆ అధ్యయనంలో తేలింది. ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్త్రీపురుషుల్లో సమానంగా కనిపించినట్లు కూడా తేలింది. సెక్స్ చేసే సమయంలో విడుదలయ్యే డోపమైన్, ఆక్సిటోసిన్ సహజంగానే, ఆటోమేటిక్గానే మూడ్ను ఎలివేట్ చేసినట్లు పరిశోధనలో బయటపడింది.