సెక్స్‌లో భాగస్వామి ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం. కొంత మంది అనే కన్నా నేటి తరం టీవీలు, చానెళ్లు, ఇంటర్నెట్‌లు చూసి వాటిలో కనిపించే రతి భంగిమలను ఆచరించి శృంగార మాధుర్యాన్ని జుర్రుకోవాలని చూస్తుంది.
భాగస్వామిలో ఒకరికి ఇష్టం లేకపోతే నిరుత్సాహం ఆవహించే ప్రమాదం ఉంది. దానివల్ల దాంపత్య జీవితం కూడా దెబ్బ తినే అవకాశాలుంటాయి. నగరాల్లో నివసించే జంటలు తీవ్రమైన అలసటకు గురై శృంగారం పట్ల ఆసక్తి కనబరచని సన్నివేశాలు ఎక్కువే ఉంటాయి.
రతి సుఖం క్రమం తప్పకుండా లేకపోతే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దంపతుల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంటుంది. అది కలహాలకు దారి తీయవచ్చు. అందువల్ల రతి సుఖాన్ని సాధ్యమైనంత వరకు తరుచుగా అనుభవించడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
రొటీన్ కాకుండా....
పడకగదిలో భాగస్వామితో రొటీన్ సంభోగాన్ని కాకుండా కొత్త భంగిమలు ఆచరించి శృంగార మాధుర్యాన్ని జుర్రుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. రతిక్రీడలో కొత్తదనాన్ని ప్రదర్శిండానికి కొన్ని మెలుకువలు కూడా నేర్చుకోవడం మంచిది. వాటిని ప్రదర్శించటానికి సంకోచించవద్దు. ఇది మీ భాగస్వామికే కాకుండా మీకు కూడా కొత్త రుచిని అందించి బంధాన్ని పటిష్టపరుస్తుంది.
నేరుగా సంభోగం వద్దు..
నేరుగా సంభోగానికి దిగితే మహిళలకు భావప్రాప్తి జరగడం సాధ్యం కాదు. ముద్దులు, కౌగిలింతలు తదితర చిలిపి చర్యలు ఆనందాన్నిస్తాయి. పురుషుడు ఆమె ఇష్టానిష్టాలను కనిపెట్టాలి. ఆమె దేహంలోని సున్నిత ప్రదేశాలను స్పర్శించాలి. ఆమె జుట్టు నిమరాలి. పెదవులు కొరకాలి. మెడ స్పర్శించాలి. వీటితో ఆమె సంభోగానికి అర్రులు చూస్తుంది. అప్పుడు సంభోగం ఆమెకు కూడా పూర్తిస్థాయిలో ఆనందాన్నిస్తుంది.
ఇలా చేస్తే....
పగలంతా పనితో అలసిపోయి రాత్రి పడక మీదికి చేరే ముందు కాస్తా ఊరట పొందాలి. ఇంటికి రాగానే ముందు పని భారం అంతా మరిచిపోవాలి. బయట జరిగిన విషయాలు మరచిపోయి మీ జీవిత భాగస్వామితో విలువైన క్షణాలను పంచుకోండి. పడక మీదికి చేరుకునే సరికి ఇరువురిలోనూ ఓ రకమైన ఉల్లాసం కలుగుతుంది
హాస్యం కూడా కావాలి....
భాగస్వామి దేహమర్దన చేస్తే ఎంతో ఉల్లాసంగా, హాయిగా ఉంటుంది. ఒకరినొకరు స్పర్శించుకుంటూ మరోమారు పడక గది సుఖాన్ని జుర్రుకోవాలి. ఇద్దరికీ ఇష్టమైన విషయాలే మాట్లాడుకోవాలి. కలిసి స్నానం చేయవచ్చు. శృంగారంలో హాస్యం కూడా అవసరమే.