బిడిఎస్ఎం అంటే ఏమిటో మీకు వెంటనే గ్రహింపులోకి రాకపోవచ్చు. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే నవల గురించి మీరు వినే ఉంటారు. ఆ నవల చదివితే బిడిఎస్ఎం అంటే ఏమిటో వెంటనే అర్థమవుతుంది. అది బంధానికి (Bondage), క్రమశిక్షణకు (Discipline), శాడిజానికి (Sadism), లైంగిక వ్యథా ప్రకోపితానందం (Masochism) అనే పదాల కూర్పుతో ఏర్పడింది.
అది ఉద్రేకపూరితమైన చర్యల సామాహారమని కూడా చెప్పవచ్చు. బిడిఎస్ఎంలో ఆధిక్యత, లొంగుబాటు అనే లక్షణాలు ఇమిడి ఉంటాయి. రతిక్రీడలో ఆధిక్యత ప్రదర్శించే, సహనం వహించే పద్ధతులను అది కలిగి ఉంటుంది. పరిమితుల్లో ఉంటే బిడిఎస్ఎం అత్యంత ఉద్రేకపూరితమైంది అవుతుంది.
పడకగదిలో బిడిఎస్ఎంను ఆచరిస్తే లైంగిక క్రీడ అత్యంత రసానందాన్ని అందిస్తుంది. ఒకే విధమైన రతిక్రీడ ద్వారా మీరు విసిగిపోయి ఉంటే బిడిఎస్ఎంను ఆచరించవచ్చు. మీ భాగస్వామి అనుమతితో దాన్ని ఆచరిస్తే మంచిది.

మాట్లాడండి...
మీరు బిడిఎస్ఎం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ మీ లైంగిక భాగస్వామికి దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల ముందు మీరు బిడిఎస్ మీద గల అనురక్తిని భాగస్వామికి చెప్పండి. దానికి మీ భాగస్వామి ఇష్టపడితే ముందుకు సాగండి.

సురక్షితమైన మాట
సురక్షితమైన మాట సిద్ధం కావడం ఎల్లవేళలా మంచిది. పరిమితి దాటితే నొప్పి పుట్టవచ్చు. అప్పుడు మీ భాగస్వామితో ఆ విషయం చెప్పి ఆపాలని సూచించడం మంచిది.

మామూలుగా ప్రారంభించండి.
అతి సాధారణమైన చర్యలతో ప్రారంభించండి. ఆధిక్యత ప్రదర్శిస్తున్నాం, లొంగిపోతున్నామనే భ్రమను కల్పించడమే ప్రధానమైన ఐడియా. మీ భాగస్వామి మీ పైకి వచ్చి రతిక్రీడను సాగిస్తానంటే పడకపై పడుకుని రెండు కాళ్లను పారజాపండి. తద్వారా అనూహ్యమైన చర్యల ద్వారా రతిని సాగించడమే బిడిఎస్ఎం.

సులభమైన పనిముట్లు..
బిడిఎస్ఎం సెషన్ కొంత సేపు ఏ విధమైన పరికరాలు వాడకుండా సాగించి, ఆ తర్వాత సంకెళ్లు, డి- రింగ్స్ వంటి వాటి సాయం పొందవచ్చు. దానివల్ల చేతులను, కాళ్లను పారజాపడానికి పరికరాలు వాడవచ్చు. ఈ పరికరాలు ఉద్రేకాన్ని ఇనుమడింపజేస్తాయి.

ప్రవర్తనలో ఇలా...
రతిక్రీడలో మీపై ఆధిపత్యం చూపుతున్న భాగస్వామిని మాస్టర్, సర్ అని సంబోధించండి. మిమ్మల్ని బానిస అనో మరో పదంతోనో సంబోధించాలని చెప్పండి.