దంపతులు తరుచుగా కౌగిలించుకోవడం సర్వసాధారణమే. ప్రేమపూరితంగా కౌగలించుకోవడం మామూలేనని భావిస్తాం. కానీ పది సెకన్ల పాటు ఇరువురు కౌగలించుకుంటే శరీరం ఆరోగ్యాన్ని పొందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
కౌగిలింత శరీరంపైనే కాకుండా మనసుపై కూడా కూడా సానుకూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. ప్రేమగా, నిజాయితీగా కౌగింలుచుకుంటే, ఆ కౌగిలింత 20 సెకన్ల పాటు ఉంటే ఆక్సిటోసిన్ అనే న్యూర్ కెమికల్‌ను ఉత్పత్తి చేస్తుందని అంటారు. దాన్నే లవ్ హార్మోన్ అంటారు.
మనలో చాలా మంది ఎక్కువ సేపు ఒకరి కౌగిలిలో ఒకరు నలిగిపోతేనే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చాలా తక్కువ సమయం మాత్రమే ఒకరి బందీగా మరొకరు ఉంటారట.
హార్మోన్ ప్రభావం..
కౌగిలించుకున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఆక్సిటోసిన్ మన మెదడుపై, శరీరంపై పెద్ద యెత్తున సానుకూల ప్రభావం చూపుతుందని సైకాయట్రిస్ట్ కౌన్సెలర్ డాకట్ర్ రుక్సానా అయాజ్ అంటున్నారు.
భయాల తొలగింపు...
దంపతులు కౌగలింతల్లో తేలిపోతే భద్రతను, ఊరటను పొందుతారని, భయాలూ ఆందోళనలు దూరవుతాయని, అయితే కౌగిలింత హార్మోన్లు విడుదలయ్యేందుకు దీర్ఘంగా ఉండాలని రుక్సానా అంటోంది.
భాగస్వామియే కానక్కర్లేదు..
తమ జీవిత భాగస్వామినే కాకుండా పిల్లలను, శునకాలను కౌగలించుకున్నప్పుడు, భాగస్వామితో నృత్యం చేసినప్పుడు ఆ హార్మోన్ విడదలవుతుంది.
మిత్రుడి భుజాలపై చేతులు..
మరో వ్యక్తికి మీరు అత్యంత సన్నిహితంగా మెలిగినప్పుడు, మీ మిత్రుడి లేదా మిత్రురాలి భుజాలపైనో చేతులు వేసినప్పుడు అలాంటిది జరగుతుందట.
అయితే, మనమంతా..
అయితే, మనమంతా అది కొద్ది సెకన్లు మాత్రమే ఇతరుల కౌగిలింతలో ఉంటామట. సగటు దీర్ఘ కౌగిలింత సమయం మూడు సెకన్లేనని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆ సమయం సరిపోదట.
బయటి ప్రపంచంలో..
బయటి ప్రపంచంలో మనం మరో వ్యక్తిని కౌగిలించుకోమని, అది పాశ్చాత్య విధానంగా తోసిపుచ్చుతున్నామని, ఈ విధానాన్ని మార్చుకోవాలని అయాజ్ అన్నారు.
ప్రేమ వ్యక్తీకరణకు సంకేతం..
కౌగిలింత అనేది ప్రేమ వ్యక్తీకరణకు సంకేతం. మీరు ఓ వ్యక్తిని కౌగిలించుకున్నారంటే ఆ వ్యక్తి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లెక్క. ఆ వ్యక్తికి భరోసా ఇస్తున్నట్లు సంకేతం.
తేడాలున్నాయి..
ప్రియురాలినో, భార్యనో కౌగిలించుకున్న తీరుకు మిత్రుడిని లేదా స్నేహితురాలిని లేదా కుటుంబ సభ్యులను కౌగిలించుకునే తీరుకు తేడాలుంటాయి.
కౌగిలించుకున్న తర్వాత..
మీ భాగస్వామిని గానీ ఇతరులను గానీ కౌగిలించుకున్నప్పుడు ఆ బందనంలోనే కొన్ని తీయటి మాటలు చెప్పండి. అది ఎదుటి వ్యక్తిలో తీవ్రమైన మార్పులు తెస్తుంది.