రతిక్రీడలో ఆనందం పొందడానికి, స్త్రీపురుషులు మన్మథ సామ్రజ్యాన్ని ఏలడానికి కొన్ని నియమాలను, చిట్కాలను పాటిస్తే మంచిది. రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్రతో పాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా బాగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్‌ప్యాక్‌ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్‌పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
అందుకే వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.

మినపసున్నండలు మంచివి
శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.

ఈ పండ్లు తింటే..
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జీవన శైలికి అనుగుణంగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు.

చాకెట్లు కూడా మంచివే..
మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది.

అనుమానాలు వద్దు
ముఖ్యంగా, దంపతుల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుందని చెపుతున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.

మహిళనే ప్రదానం
పురుషుడికి మహిళ సహకారం ఉంటే ఆనందపు అంచులను చూడవచ్చు. స్త్రీ, పురుషుల్లో రసికత ఉంటే జీవితం ఆనందమయమవుతుందని చెపుతున్నారు.

కొద్దిపాటి డ్రింక్ కూడా..
మోతాదు మించని మద్యం వల్ల సెక్స్ భయాలు పోయి హాయిగా సెక్స్లో పాల్గొనవచ్చు. 60 ఎంఎల్ వరకు డ్రింక్ చేయవచ్చు. దానికి మించి తీసుకుంటే ఆసక్తి తగ్గుతుంది.

వెరైటీ కోసం..
రోజూ ఒకే చోటుకాకుండా వైవిధ్యం కోసం వివిధ ప్రదేశాల్లో సెక్స్లో పాల్గొంటే ఆసక్తి పెరుగుతుంది. బాత్రూమ్లు, సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్లో కూడా భాగస్వామి ఇష్టంతో పాల్గొవాలి. ప్రదేశం మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.