లైంగిక జీవితంపై దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పటిష్టపడాలంటే, దాంపత్య జీవితం సుఖమయంగా సాగాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే.
మీ భాగస్వామికి వారంలో కనీసం పది సార్లు నువ్వంటే నాకిష్టమనో, నిన్ను ప్రేమిస్తాననో చెప్తే దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయం ఓ సర్వేలో కూడా వెల్లడైంది. వన్ పోల్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో ఆ విషయం తేటతెల్లమైంది.
నెలలో మూడు డేట్స్, మూడు రోమాంటిక్ ఆశ్చర్యాలు, పది ప్రేమపూరిత సంభాషణలు తమ జీవితాన్ని సుఖమయంగా ఉంచుతున్నాయని 92 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.
ప్రేమిస్తున్నానంటే ఎగిరి గంతేయడమే..
వారానికి పది సార్లు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నానని, నువ్వంటే నాకిష్టమని చెప్తే ఇరువురి మధ్య సంబంధం సంతోషదాయకంగా ఉంటుందని సర్వేలో తేలింది.
గొడవలు కూడా..
ఇరువురి మధ్య గొడవలు కొన్నిసార్లు అద్భుతాలు సృష్టిస్తాయి. గొడవ పడిన తర్వాత విచారం వ్యక్తం చేస్తే దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని సర్వేలో తేలింది.
సుఖమయ జీవితానికి...
వారానికి మూడు సార్లు శృంగారంలో పాల్గొనే దంపతులు, టీవి ముందు నెలకు ఆరుసార్లు కౌగిటిలో ఒదిగిపోయే దంపతులు హాయిగా ఉన్నట్లు కూడా సర్వేలో తేలింది.
పెళ్లి చేసుకోవడం సులభమే..
పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు గానీ దాన్ని పటిష్టంగా, ఆనందదాయకంగా మలుచుకోవాలంటే నిబద్ధత కావాలని అంటున్నారు.
అలా చేయకపోతే..
ముద్దులు, కౌగిలింతలతో వాదనలకు స్వస్తి చెప్పి, పడక గదికి చేరుకోకపోతే సమస్య తప్పదని అంటున్నారు.