పడక గదికి చేరుకునే ముందు స్త్రీపురుషులు వివిధ ఊహాగానాలతో, శృంగార భావనలతో ఉంటారు. తన భాగస్వామిని ఏలా సంతోషపెట్టవచ్చుననే ఆలోచనే మది నిండా ఉంటుంది. ముఖ్యంగా తనతో శారీరక సుఖం పంచుకునే పురుషుడు లేదా భర్త నుంచి మహిళ ఎంతో ఆశిస్తుందని అంటారు.
అయితే, కామక్రీడ విషయంలో పురుషులు కూడా తొందరపాటుకు గురవుతారనే అభిప్రాయం ఉంది. దీంతో పడక గదిలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంపై వారిలో అయోమయం నెలకొంటుంది. ఏ పడక గదికి చేరిన మహిళలతో పురుషులు ఆచితూచి ప్రవర్తించడంతో పాటు కొన్ని చేయకుండా ఉండటమే మంచిదని కామశాస్త్ర నిపుణులు అంటారు.
కామక్రీడలో మహిళకు కూడా పురుషులు ప్రాధాన్యం ఇవ్వాలి. వారి ఇష్టానిష్టాలను తెలుసుకోవాలి. ఆమె శారీరక కదలికలను బట్టి ఆమెలో చెలరేగుతున్న అలజడులను కనిపెట్టాలి. ఆమెకు రతిక్రీడలో చురుకైన పాత్ర ఇవ్వాలి. ఆమె బిడియాన్ని తొలిగించుకునే విధంగా పురుషుడు వ్యవహరిస్తే కామక్రీడలోని మజా చెప్పనలవి కాకుండా ఉంటుంది.

అలా లేచిపోకూడదు..
వీర్యస్ఖలనం జరిగిన వెంటనే పడక మీంచి లేచి వెళ్ళిపోయే మగవారిని మహిళలు ఇష్టపడరని చెబుతారు. మహిళలలో భావప్రాప్తి జరిగి, దాని తాలూకూ కైపు పురుషుల కంటే చాలా మెల్లగా దిగుతుంది. అందువల్ల వారు స్ఖలనం తర్వాత కూడా పక్కనే వుండి శరీరమంతా మునివేళ్ళతో సుతారంగా నిమురుతూ మాట్లాడాలని కోరుకుంటారని చెపుతున్నారు.

ఆమె మనోభావాలకు ప్రాధాన్యం
పడకగదికి చేరిన తర్వాత తన మనోభావాల కన్నా స్త్రీ మనోభావాలకు పురుషుడు ప్రాధాన్యం ఇవ్వాలి. దాన్ని మహిళ ఎంతో ఇష్టపడుతుందని చెబుతారు.

పూర్తిగా కూడా వదిలేయద్దు
మహిళకు పూర్తి ప్రాధాన్యం ఇచ్చి మొద్దు రాచిప్పలా ఉండిపోకూడదని చెబుతున్నారు. కి ముఖ్యంగా పడక గదిలో స్త్రీ మూడ్‌ను బట్టి నడుచుకోవాలని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలా చెప్పకూడదట..
రతి క్రీడ చివరి దశకు చేరిన తర్వాత వీర్య స్ఖలనం చేసే ముందు చెప్పాలని ఏ మహిళ కూడా కోరుకోదు. ఒకవేళ పురుషుడు ఈ ప్రశ్న వేసిన వెంటనే స్త్రీ తన మూడ్ మార్చేసుకుంటుందట. అలాగే, ఇక చాలా, ఇంకా కావాలా వంటి ప్రశ్నలు కూడా వేయకూడదట.

మూడ్‌ను బట్టే వ్యవహరించాలి..
భార్య మూడ్, ఆమె సెక్స్‌లో పొందుతున్న సుఖాన్ని ముఖ కవళికల్లో గ్రహించి అందుకు అనుగుణంగా పురుషుడే ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నారు.

బిడియపడితే ఇలా..
స్త్రీ సిగ్గరి అయితే లేదా మీకు మొదటి సారైతే, ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే అడగండి. మొదటిసారి కనుక స్త్రీ ఏ జంకూ లేకుండా సరేనంటే అపుడు మళ్లీ మళ్లీ ఆమెను అడిగి మూడ్ పాడు చేయకూడదని సలహా ఇస్తున్నారు.

ఎలా ఉందో చెప్పాలి..
రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషులను కూడా మహిళలు అసహ్యించుకుంటారని చెపుతున్నారు. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని పురుషుడు చెప్తే ఆమె తెగ మురిసిపోతుందట.