•  

శృంగారం: మగాడు ఎలా పడ్తాడు (పిక్చర్స్)

మగాళ్లను పడేయడం ఏమంత కష్టం కాదని మహిళలు భావిస్తుంటారు. నిజానికి, మహిళలు ముందుకు సాగితే పురుషుడు పడిపోవడం ఖాయం. అయితే, కొంత మంది దేశముదుర్లు ఉంటారు. కొంత మంది మహిళ తానై ముందుకు వస్తే మరో విధంగా ప్రతిస్పందిస్తారు.



మొదటిసారి కలయికలోనే దూకుడు ప్రదర్శిస్తే మగాడు ముందుకు రాకపోవచ్చు. పురుషుడిని ఊరించి, ఉడికించి, వశం చేసుకోవాలి. అప్పుడు అందులోని మాధుర్యం అతనికే కాకుండా మీకు కూడా తెలిసి వస్తుంది.



మీకు నచ్చిన మగాడు ఎదురైనప్పుడు మీరు ఎలా ఫీలవుతారో కూడా మఖ్యమే అవుతుంది. బంధాన్ని పెంచుకుని ముందుకు సాగడానికి ఇరువురి మధ్య విశ్వాసం కూడా అవసరం. తొలి పరిచయంతోనే రతిక్రీడకు సిద్ధపడితే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త...



సొంత జీవితంపై ఒక మహిళ:

సొంత జీవితంపై ఒక మహిళ:

 

మీకు ఇష్టమైన వారితో గడిపేందుకు మీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకవేళ మీరు మీ స్నేహితుల చర్చల్లో మునిగి ఉన్నప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు మీరు తనతో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. అలా చేయడానికి ప్రయత్నిస్తారు.

 

తొలిసారి కాకుండా:

తొలిసారి కాకుండా:

 

తొలిసారి కలుసుకున్నప్పుడు మగవారు తాము కోరుకున్న దానికి మహిళలు అనుకూలంగా వ్యవహరించే వారిని ఇష్టపడక పోవచ్చు. కలిసి బయటికి వెళదామని అడిగినప్పుడు.. అతడ్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో అనే దానిపై అతడు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

 

గాలిలో ప్రేమలు:

గాలిలో ప్రేమలు:

 

అతన్ని చూసినప్పుడు మీ గుండె చప్పుడు వేగంగా ఉంటుందా? అతని మాట వినగానే చూడాలని అనిపిస్తుందా? అతనితో ఉన్నప్పుడు కంఫర్ట్‌గా, సెక్యూరిటీగా అనిపిస్తుందా? ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు అతనితో అనుబంధాన్ని కొనసాగించవచ్చు.

 

మీ పట్ల జాగ్రత్త:

మీ పట్ల జాగ్రత్త:

 

చిన్న విషయాలకు బాధపడకండని ఎవరో చెప్పినట్లుగా కాకుండా నూతన అనుబంధాన్ని కొనసాగించేందుకు అలాంటి పొరపాట్లను కూడా జరగకుండా చూసుకోవాలి. చిన్న విషయాల్లో కూడా జాగ్రత వ్యవహరించడం వల్ల అతని హృదయంలో మీకు ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది.

 

సెక్సీ:

సెక్సీ:

 

అతన్ని కొన్ని సందర్బాల్లో మీరు భయపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రారంభ దశలో మీరు నాన్ సెక్సువల్‌గా అనుబంధాన్ని కొనసాగించడం వల్ల అతనికి మీపై ఇష్టం పెరిగుతుంది.

 

శృంగారం:

శృంగారం:

 

తొలి పరిచయంలోనే శృంగారానికి పోకూడదు. ఇద్దరు తమ అనుభవాలను పంచుకోవాలి, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని ఆ అందమైన అనుబంధాని కొనసాగించవచ్చు. మరేదైనా చిన్న విషయంలో కూడా మీరు విడి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి శృంగారం కోసం తొందరపడాల్సిన అవసరం లేదు.

 

నో-నాన్సెన్స్:

నో-నాన్సెన్స్:

 

ఏ మహిళ అయిన తనను గౌరవించే వారినే ఇష్టపడుతుంది. ఆ విధంగా అతని వ్యవహార శైలి ఉండకపోతే అతనికి దూరంగా ఉండడం మంచిది. ఇతర మహిళలను, వివాహిత మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి దూరంగా ఉంచాలి.

 

స్నేహితులు:

స్నేహితులు:

 

స్నేహితుల ముందు గానీ, ముఖ్యమైన వ్యక్తుల ముందుగానీ అతనికి సంబంధించిన మంచి విషయాలనే ప్రస్తావించాలి. అతన్ని చూసి కాకుండా అతనితోపాటు నవ్వితే మంచిది.

 

దూరం:

దూరం:

 

మీకు అతని నుంచి లెక్కలేనన్ని కాల్స్, టెక్ట్స్ మెసేజెస్ వస్తున్నాయని అనుకున్నట్లయితే వారి ప్రవర్తన ఇతరుల పట్ల ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. అతనితో భవిష్యత్ లో వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంటుంది.

 

ఆకర్షణ:

ఆకర్షణ:

 

ఒక వేళ అతను మంచి ప్రవర్తన, హుందాతనంతో వ్యవహరించినట్లయితే అతనికి వంద మార్కులు ఇవ్వవచ్చు. మీరు కూడా అలాంటి సత్ ప్రవర్తన, విలువలు కలిగిన వ్యక్తులైతే అతని నిజాయితీపై ఆధారపడి అతనితో అనుబంధాన్ని కొనసాగించవ్చు.

 

 

English summary
Someone said don't sweat the small stuff. But in a new relationship you definitely need to! Doing little things to show to him that you care will make his heart grow fonder.
Story first published: Monday, November 25, 2013, 17:39 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras