రతిక్రీడలో మహిళకు భావప్రాప్తి కలిగిందా, లేదా అనేది తెలుసుకోవడం చాలా కష్టమని ఇంత కాలం భావిస్తూ వచ్చారు. ఇప్పుడు అది సాధ్యమని చెబుతున్నారు. మహిళ మెదడులో భావప్రాప్తికి సంబంధించిన స్పందనలను కనిపెట్టే మార్గాన్ని అభివృద్ధి చేశారు. అమెరికా శాస్త్రవేత్తలు ఆ విధానాన్ని కనిపెట్టారు.
భావప్రాప్తి మహిళల్లోని నరాలు భావప్రాప్తి కారణంగా తిమ్మిరెక్కినట్లు అవుతాయి. దాన్ని మహిళ నొప్పిగా కాకుండా సుఖంగా ఆస్వాదిస్తుందట. మహిళలోని 30 వివిధ శరీర భాగాలు భావప్రాప్తికి అనుభూతి చెంది స్పందిస్తాయని అంటున్నారు. ఉద్వేగం, స్పర్శ, సంతోషం, సంతృప్తి, జ్ఞాపకం వంటి వాటిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన స్కానింగ్ యంత్రం ద్వారా మహిళల్లోని ఏయే భాగాలు భావప్రాప్తి సమయంలో అనుభూతికి లోనయ్యాయో తెలుసుకున్నారట. ఆ రకంగా మహిళ్లలోని సెక్స్ అనుభూతులను వారు రికార్డు చేసినట్లు చెబుతున్నారు.
స్కానర్ ద్వారా ఇలా చేశారు
మెదడులోని కణతులను కనిపెట్టడానికి వాడే టన్నెల్ లాంటి యంత్రం మాగ్నెటిక్ రిసోనన్స్ ఇమేజింగ్ (ఎమ్ఆర్ఐ) స్కానర్‌లో బ్లాంకెట్ కింద పడుకుని 8 మంది మహిళలను స్టిమ్యులేట్ కావాలని పరిశోధకులు అడిగారు.
ఐదు నిమిషాల్లోపే..
ఎక్కువ మంది మహిళలు ఐదు నిమిషాల్లపే భావప్రాప్తి చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. కొద్ది మందికి మాత్రం 20 నిమిషాల దాకా సమయం పట్టింది.
ప్రతి రెండు సెకన్లకు..
మహిళలోని ఏ భాగం చురుగ్గా పనిచేసిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎమ్ఆర్ఐ స్కానర్ ప్రతి రెండు సెకన్లకు ఓ చిత్రాన్ని తీసింది.
ఈ భాగంలో చురుగ్గా..
భావప్రాప్తికి రెండు నిమిషాల ముందు మెదడులోని రివార్డు సెంటర్లు చురుగ్గా మారినట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. భోజనం చేసినప్పుడు, పానీయం సేవించినప్పుడు సాధారణంగా ఈ భాగాలు చురుగ్గా పనిచేస్తాయి.
పతాక స్థాయికి ముందు..
పతాక స్థాయికి చేరుకోవడానికి కొద్ది ముందుగా మెదడులోని సెన్సరీ కార్టెక్స్ లాంటి ఇతర భాగాలు చురుగ్గా మారినట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇది టచ్ సంకేతాలను స్వీకరిస్తుంది.శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలు పంపే థాలమస్ కూడా చురుగ్గా మారింది.
ఉద్వేగానికి సంబంధించి..
భావప్రాప్తి పొందడం ప్రారంభమైన తర్వాత ఉద్వేగానికి కారణమైన మెదడులోని ఇతర భాగాలు స్పందించాయి. చివరగా మెదడులోని హైపోథాలమస్ చురుగ్గా మారినట్లు కనిపెట్టారు. ఇది మెదడులోని నియంత్రణ భాగం. ఉష్ణోగ్రతను, ఆకలిని, దాహాన్ని, అలసటను ఇది నియంత్రిస్తుంది.
మరో భాగం...
అదే సమయంలో ఆనందాన్నిచ్చే న్యూక్లియస్ అకుంబెన్స్ చురుగ్గా మారినట్లు పరిశోధకులు గుర్తించారు. మరో కాడేట్ న్యూక్లియస్.. ఇది జ్ఞాపకానికి సంబంధించిన భాగం.
విస్తృతమైన ప్రతిస్పందన..
మహిళల్లో మెదడు, శరీరం అంతటా భావప్రాప్తి విస్తృతమైన ప్రతిస్పందనను కలిగిస్తుందని రుట్గెర్ విశ్వవిద్యాలయానికి చెందిన బారీ కోమిసారుక్ చెప్పినట్లు డైలీ మెయిల్ రాసింది.
చేతులు లేపుతారు...
మహిళలు భావప్రాప్తి సమయంలో పలు మార్లు ప్రతి సెషన్‌లో చేతులను పైకి లేపుతారాట. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఈ రకంగా చేస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
సుదీర్ఘంగా...
మహిళలు సుదీర్ఘంగా భావప్రాప్తిని కోరుకుంటారని, వేగంగా మళ్లీ మళ్లీ కోరుకుంటారని తేలినట్లు కోమిసరూక్ చెప్పారు.
మహిళకు పది, పదిహేను సెకన్లు..
మహిళల్లో 10-15 నిమిషాలు భావప్రాప్తికి సంబంధించిన భావన ఉంటుంది. పురుషుడిలో అది ఆరు సెకన్లు మాత్రమే ఉంటుంది.