నడి వయస్సు వచ్చిన తర్వాత చాలా మంది లైంగిక జీవితం పట్ల అనాసక్తి చూపిస్తుంటారు. అది ఆరోగ్యంపై, దాంపత్యజీవితంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. దానికితోడు, కొన్నిసార్లు మనసు తపన పడుతున్నా శరీరం సహకరించడానికి మొరాయిస్తుంది. దీంతో లైంగిక జీవితం సమస్యల్లో చిక్కుకుంటుంది.
మధ్య వయస్సు దాటిన తర్వాత లైంగిక జీవితంలో స్త్రీలలో తలెత్తే ఈ రకమైన శారీరక సమస్యకు వైద్య పరిభాషలో మోనోపాజ్ అని అంటారు. అలాగే ఇదే రకమైన సమస్యలు మగవారిలో కూడా తలెత్తుతుంది. దీన్ని మేల్ మోనోపాజ్ లేక ఆండ్రోపాజ్ అంటారు. కొన్నాళ్ల వరకు మోనోపాజ్ అనే పదం అందరికీ సుపరిచితమైనా ఆండ్రోపాజ్ అనేది మాత్రం ఇటీవలే అందరికీ తెలిసి వస్తోంది.
మధ్య వయస్సు తర్వాత హార్మోన్ల అసమతుల్యం వల్ల స్త్రీలలో మాత్రమే మోనోపాజ్ దశ ఏర్పడుతుందనే భావన ఇప్పటి వరకు ప్రచారంలో ఉంది. ఆదే విధమైన సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుందని ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. దాదాపు 40 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ఈ ఆండ్రోపాజ్ దశ తలెత్తుతుంది.
హార్మోన్ల తగ్గుదల
ఆండ్రోపాజ్ వల్ల సెక్స్ జీవితంలో ఆసక్తి లోపించడంతో పాటు అంగస్థంభన సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం అదుపుతప్పడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే శరీరంలో తగ్గిన టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం తగినంత ఉండేలా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.
ఏం చేయాలి..
టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గకుండా ముందు నుంచే ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సోయా, పాలు, చికెన్‌లాంటి పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, వేరుశెనగ, బాదం, జీడిపప్పులాంటివి ఆహారంలో ఉండేలా చూచుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలను పెంచవచ్చు.
సి - విటమిన్లు అవసరం..
సి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్రావం తగ్గిపోకుండా చూసుకోవచ్చు. ఇలా ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాన్ని కూడా అవలంభిస్తే ఆండ్రోపాజ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
వైద్యులను సంప్రదించాలి
తగిన జాగ్రత్తలు పాటించినా ఆండ్రోపాజ్ సమస్య బాధపెడితే వైద్యుల సలహా మేరకు హార్మోన్ చికిత్స చేసుకోవడం మంచిది. ఏమైనా, లైంగిక జీవితం పట్ల ఆసక్తి కొరవడకుండా చేసుకోవడం దాంపత్య జీవితానికి కూడా మంచిది.
కొత్త పద్ధతులు అవలంబించాలి..
రతిక్రీడలో రొటీన్ పద్ధతి వల్ల విసుగు వస్తుంది. ఆ విసుగును తొలగించుకోవడానికి రతిక్రీడలో కొత్త భంగిమలు అనుసరించాలి.