రతిక్రీడ సమయంలో దంపతులు ఊహించని విషయాలు చోటు చేసుకుంటాయి. దీనికి రతిక్రీడలో అదరగొడుతామని విశ్వాసంతో ఊగిపోయే దంపతులు కూడా ఆశ్చర్యానికి లోను కాక తప్పదు. లైంగిక క్రీడ సమయంలో మహిళలు డ్రై కావడం, వారికి చిరాకు కలడం సర్వసాధారణమని యాలే విశ్వవిద్యలయానికి చెందిన డాక్టర్ మేరీ జానే మింకిన్ అంటున్నారు.
రతిక్రీడ సమయంలో యువతుల యోని డ్రై కావడం 33 శాతం మామూలేనని మహిళల ఆరోగ్యం తెలియజేస్తోందని హాఫింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. సంభోగం, అంటే అంగప్రవేశం జరిగిన సెకన్లలో లేదా నిమిషాల్లో అది సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా అనే విషయం తెలిపోతుందట.
సెక్స్ విషయానికి వస్తే మహిళలు సాధారణంగా లైంగిక తటస్థతతో ప్రారంభమవుతారని ఓహ్యోలోని సుమ్మా సెంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ డైరెక్టర్ కింబర్లే రెస్నిక్ అండర్సన్ అంటున్నారు. డాగీ స్టయిల్ వంటి కొన్ని భంగిమల్లో మూత్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఏమైనా, మహిళల్లో సంభోగం సమయంలో కొన్ని అనూహ్యమైన విషయాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అలా ఎందుకు...
మహిళల్లో మూత్ర విసర్జన భావన కలగడమనేది జి - స్పాట్ స్టిమ్యులేషన్ వల్ల జరుగుతుందని, దానివల్ల మహిళల్లో భావప్రాప్తి కలుగుతుందని సెక్స్ కోచ్, ఇగ్నైట్ యువర్ ప్లెజర్ ఫౌండర్ ఆమీ లేవిన్ అంటున్నారు.
ఎందుకు మహిళ మూలుగుతుంది..
లైంగిక క్రీడ సందర్భంగా మహిళలు చేసే శబ్దాలు సంభోగ ప్రక్రియకు సంబంధించిందని అంటున్నారు. 2007లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం - తన పురుషుడు త్వరగా భావప్రాప్తి పొందడానికి మహిళలు అలా మూలుగుతారని, 87 శాతం మంది మహిళలు తన పురుషు భాగస్వామిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తారని తేలినట్లు సిఎన్ఎన్ రిపోర్టు తెలియజేస్తోంది.
శబ్దం ఎందుకు వస్తుంది..
సంభోగం చేసే సమయంలో కొన్నిసార్లు మహిళల యోని నుంచి గాలి బయటకు వచ్చి శబ్దం వస్తుంది. ఇది యోనిలోకి గాలి చొరబడడం వల్ల వచ్చే శబ్దమని చెబుతున్నారు. ఇతర శబ్దాలకు ఈ శబ్దాలకు తేడా ఉంటుందని కూడా అంటున్నారు.
తలనొప్పి కూడా వస్తుంది..
తన పురుష భాగస్వామితో సంభోగం చేస్తున్నప్పుడు మహిళకు అనుకోకుండా తలనొప్పి వస్తుంది. ఇది మెడలో లేదా గొంతులో వచ్చే నొప్పి. కామోద్రేకం పెరిగినప్పుడు ఇలాంటి నొప్పి కలుగుతుందని అంటున్నారు. లేదంటే, అకస్మాత్తుగా నొప్పి వచ్చి వెనువెంటనే భావప్రాప్తి జరుగుతుందని అంటున్నారు.
యోని తడారిపోవడం సాధారణం..
మహిళల్లో సంభోగం సమయంలో యోని తడారిపోయి అంగప్రవేశం సయమంలో తీవ్రమైన నొప్పి కలగడం సాధారణమని డాక్టర్ మేరీ జానే మింకిన్ అంటున్నారు. దానివల్ల చిరాకు కూడా కలుగుతుందని అంటున్నారు. లూబ్రికెంట్స్ వాడితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
మహిళలకు తెలిసిపోతుందట..
సంభోగం ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే సెకన్లలో లేదా నిమిషాల్లో రతిక్రీడ ఎలాంటి ఫలితం ఇవ్వబోతుందో మహిళలకు తెలిసిపోతుందని ఓహ్యోలోని సుమ్మా సెంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ డైరెక్టర్ కింబర్లే రెస్నిక్ అంటున్నారు. లైంగిక కార్యకలాపాలతో సంభోగాన్ని మొదలు పెడితే అది వర్కవుట్ కావచ్చునని అంటున్నారు.
దృష్టి మళ్లితే అంతే...
రతిక్రీడ సమయంలో కొంత మంది పూర్తిగా వేరే విషయాలను మరిచిపోతుంటారు. మరికొంత మంది సవాలక్ష ఆలోచనలు చేస్తుంటారు. అయితే, రతిక్రీడ నుంచి మనసును మళ్లించే విషయం మహిళల్లో ఎక్కువగా జరుగుతుదని నిపుణులు అంటున్నారు. తమ జీవితంలో ఏం జరుగుతోందని వారు ఆందోళనకు గురవుతుంటారని రెస్నిక్ అండర్సన్ అంటున్నారు. ప్రాక్టీస్ ద్వారా దాన్ని మార్చుకోవచ్చునని చెబుతున్నారు.