•  

శృంగారం: చూపుల్లో చురకత్తులుంటే.. (ఫొటోలు)

తొలి చూపు ప్రభావం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని కూడా అన్నారు. మొదటిసారి చూసినప్పుడు పురుషుడు ఎలా ప్రతిస్పందించాడనేది మహిళలు గుర్తించాల్సి ఉంటుంది. అతను చూసి ముఖం తిప్పేసుకుంటే మీరు అతన్ని ఆకర్షించలేకపోయారని గ్రహించాలి.మీరు అదిరిపోయే అందాలతో కాకుండా మీ వ్యక్తిత్వం ద్వారా అతన్ని అకట్టుకోవచ్చు. హుందాగా, హాయిగా మీరు కనిపిస్తే అతను ఎంతో ఇష్టపడతాడు. అతడు మీ వైపు అదే పనిగా చూస్తున్నాడంటే మీరు అతన్ని ఎక్కువగా ఆకర్షించినట్లే.మహిళలు ధీమా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే పురుషుడికి ఇష్టంగా ఉంటుంది. పురుషుడిని మీ వైపు తిప్పుకోవాలంటే, మీ పట్ల అతను అసక్తి ప్రదర్శించాలంటే ఏం చేయాలో చూద్దాం...ఆరోగ్యకరంగా కనిపించాలి...

 

తనకు ఎదురు పడే మహిళ ఆరోగ్యకరంగా కనిపిస్తే పురుషుడు ఇష్టపడతాడు. మీ చూపుల్లో అతను చూపులు కలిపినప్పుడు మీ కళ్లలో వెలుగు కనిపించాలి.

 

నవ్వు నాలుగు విధాలా..

 

నవ్వు నాలుగు విధాలా మేలు చేస్తుంది. మీ నవ్వు ముఖం అతన్ని ఆకర్షిస్తుంది. అది కళ్లలో కూడా ప్రతిఫలిస్తుంది. మీరు నిజాయితీగా నవ్వుతున్నారా, నటిస్తున్నారా అనే విషయాన్ని పురుషుడు ఇట్లే గ్రహిస్తాడు. చాలా ఉల్లాసంగా కనిపించాలి.

 

గొంతు కూడా పట్టిస్తుంది...

 

మీ మాటలు కూడా అతనికి సంకేతాలను అందిస్తుంది. మీరు చాలా హాయిగా మాట్లాడాలి. ఏ మాత్రం బిడియం ప్రదర్శించకుండా కలుపుగోలుగా మాట్లాడితే అతను ఇష్టపడుతాడు.

 

నడుం సన్నగా ఉంటే...

 

నడుం సన్నగా ఉండి, పిరుదులు లావుగా ఉండే మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. అది ఫెర్టిలిటీకి సంకేతమంటారు.

 

చూపులపైనే దృష్టి..

 

మీ చూపులను బట్టి అతను మిమ్మల్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు. మీ మనసును చూపులతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

 

 

English summary
Your eyes met, he give you a quick glance and in that split second seems to have made up his mind about you and turned away. What just happened? Well it was a mental checklist and you did pass muster.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras