పురుషులు చాలా మంది ఆఫీసు ఒత్తిడితో అలసిపోయి ఇంటికి వస్తుంటారు. భార్య వడ్డించే భోజనం తినేసి నిద్రపోతుంటారు. ఆలసటలో తన మహిళను పట్టించుకోరు కూడా. ఆమె పక్కన ఉన్నా పట్టించుకోకుండా నిద్రపోయేవాళ్లు ఉంటారు. ఆమెకు మాత్రం రోజూ కాకపోయినా అప్పుడప్పుడైనా రతిక్రీడలో ఓలలాడాలని ఉంటుంది. ఈ విషయాన్ని పురుషులు మరిచిపోకూడదు. బిడియం వల్ల, అతను ఏమనుకుంటాడో అనే సందేహంతో చాలా మంది మహిళలు తమలో తామే సతమవుతూ ఉంటారు.
పురుషులకు మరో సమస్య కూడా ఎదురవుతుంది. చాలామంది పురుషులకు అంగస్థంభన బాగానే ఉంటుంది. కానీ రతిక్రీడలో వీర్యస్కలనం త్వరగా అయిపోతుంది. ఇంకొందరిలో వీర్యస్కలనం సరిగా కాదు. దీంతో పురుషులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. వయాగ్రా వంటి మందులు వాడుతుంటారు. సెక్సాలజిస్టులు, శృంగార నిపుణులను సంప్రదిస్తుంటారు.
అంగస్తంభన, వీర్యస్కలన సమస్యలు పురుషుడి వయస్సుపై, వివిధ వ్యాధులకు వాడే మందులను బట్టి ఆధారపడి ఉంటాయని అంటారు. ఆందోళనలు ఆ సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి. సమస్యను సమయస్ఫూర్తితో, ఆలోచనతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ఆఫీసులో పని ఒత్తిడి ఉండటం సర్వసాధారణం. తమ భర్త వాడుకునేలా మహిళ ప్రోత్సహించాలి. ఆఫీసుకు వెళ్లిన భర్తకు సెక్స్‌పై మూడ్ తెచ్చేలా శృంగారపరమైన మెసేజ్‌లు ఇవ్వొచ్చు లేదా ఫోను చేసి ముగ్గులోకి దించేలా మెల్లగా మాటలు కలపవచ్చు. పురుషుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసు విషయాలను మరిచిపోతే మంచిది.
మహిళలు తమ మాటలు, డ్రెస్‌లతో భర్తను తనవైపు తిప్పుకోవచ్చు. అతనిలోని అలసట కరిగిపోయే విధంగా ముగ్గులోకి దింపి అలరించవచ్చు.
దంపతుల వయస్సు యాభై యేళ్ళకు పైబడితే వీర్య స్కలనం ఆలస్యంగా జరుగుతుంది. మహిళలు మోనోపాజ్ దశకు కూడా చేరివుంటారు. వీరు రతిక్రీడకు సంబంధించిన మందులు వాడకపోవడం మంచిదని నిపుణులు అంటారు. ఈ వయస్సులో ఇలాంటి మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉత్పన్నమవుతాయని చెపుతున్నారు.
బిపి, హృద్రోగ సమస్యలు ఉంటే ఈ మందులు ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తాయి. ఒకసారి వీర్యస్కలనం అయినా మళ్లీ అంగస్తంభన కావడానికి గంట, రెండు గంటల సమయం పడుతుందనే విషయాన్ని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.