పురుషులు తరచుగా సెక్స్ గురించి ఆలోచిస్తారని, అయితే మహిళలు తరచుగా సెక్స్ కోరతారని నిపుణులు అంటారు. గతంలో పురుషులు శృంగారానికి డిమాండ్ చేసేవారు. మహిళతో శృంగారం పురుషుడి హక్కుగా ఉండేది. అయితే, ఆధునిక కాలంలో మహిళలు పురుషుల నుంచి ఎక్కువగా రతిక్రీడను కోరుతున్నట్లు చెబుతున్నారు. పురుషులు ప్రాధేయపడడం, మహిళలు తిరస్కరించడం అనేవి ఇప్పుడు తక్కువగా ఉన్నాయని అంటున్నాైరు.
పరిస్థితులు మారాయి. ఆధునిక మహిళ తన భావాలను వ్యక్తీకరించడానికి అనువైన సామాజిక వాతావరణం ఏర్పడింది. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నారు. రతిక్రీడ అనేది తప్పు అనే భావన ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో ఇంకిపోయి ఉంది. ఆ భావన తప్పనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. పురుషులతో తమ లైంగిక వాంఛలను మహిళలు స్వేచ్ఛగా వెల్లడించే వాతావరణం ఏర్పడింది.
నిజానికి, మహిళలు రతిక్రీడలో ఆధిపత్యం సాధించాలని అనుకోవడానికి కారణాలు ఏమిటనేవి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతాయి. రతిక్రీడ అనేది మహిళను చాలా విషయాల్లో సాంత్వనకు గురి చేస్తుంది. అది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మానసిక ఒత్తిళ్లను కూడా దూరం చేస్తుంది. రతిక్రీడ వల్ల వచ్చిన తమ శరీరంలో, మనస్సులో వస్తున్న మార్పులను మహిళలు నేరుగా గుర్తించనప్పటికీ అది ఆనందం ఇస్తున్న భావనకు మాత్రం గురవుతున్నారు. మహిళలు లైంగిక క్రీడను ఎందుకు కోరుతున్నారో చూద్దాం..
శారీరకంగా ఆనందాన్నిస్తుంది. దేహాన్ని అది తేలిక పరుస్తుంది. రతిక్రీడ ప్రాథమిక అవసరంగా మారిపోయింది. పురుషులను తమ వైపు తిప్పుకుని తమకు ఆనందం కలిగేలా శృంగారాన్ని కదును తొక్కించడంలో మహిళలు ముందుంటున్నారు.
రతిక్రీడను మనసారా అనుభవించడం వల్ల మహిళల్లో సానుకూల భావనలు పెరుగుతాయి.. పురుషుడు ఆమె శరీరాన్ని ప్రశంసించినపుడు ఆమె మానసికానందంతో ఉప్పొంగిపోతుంది. చురుగ్గా సెక్స్‌లో పాల్గొంటుంది. తన పురుష భాగస్వామికి ఆనందాన్ని పంచిస్తూ తాను
ఆనందాన్ని అనుభవిస్తుంది.
లైంగిక క్రీడ పాల్గొన్నప్పుడు మహిళల్లో ఆక్సీటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది శారీరక అనుబంధాన్ని పెంచుతుంది. బంధాలు నిలబడాలంటే లైంగికపరమైన సాన్నిహిత్యం కూడా అవసరమనే భావన మహిళల్లో పెరిగింది.
రతిక్రీడ ఒత్తిళ్లను దూరం చేస్తుంది. తద్వారా ప్రతికూల భావనలు తొలగిపోతాయి. రతిక్రీడలో శ్వాస సంబంధిత వ్యాయామాలు జరిగి కొన్ని హార్మోన్లు విడుదలై ప్రశాంతతను చేకూరుస్తాయి.
అరగంట పాటు రతిక్రీడను సాగిస్తే 85 కేలరీలు ఖర్చవుతాయి. ఈ కారణంగా కూడా అనేకమంది మహిళలు తమంత తాము యాక్టివ్ రోల్ తీసుకొని పురుషులపై ఆధిపత్యం చేస్తున్నారు. మహిళలు రెండో సెషన్ వేయటానికి కూడా వెనకాడటం లేదని తరచుగా వారు సంప్రదించే మానసిక వేత్తలు కూడా వెల్లడిస్తున్నారు.