తమ శృంగార సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకోవడం మగాళ్లకు అలవాటు. తన మహిళా భాగస్వామితో సెక్స్ చేసిన తర్వాత తాను ఎలా అదరగొట్టిందీ చెప్పుకుంటూ పోతాడు. తన గొప్పతనం, తన శక్తిసామర్థ్యాల గురించి మాట్లాడతూ ఉంటాడు.
తన మహిళ భాగస్వామి ఆ మాటలు వింటే ఎలా ప్రతిస్పందిస్తుందనే అతనికి ఏ మాత్రం పట్టదు. దీనిపై జర్నల్ ఆప్ సెక్స్ రీసెర్చ్ అధ్యయనం ఒక్కటి ఉంది స్త్రీకి భావప్రాప్తి కలిగించడంలో తమ సామర్థ్యం గురించి, పడకపై తాము ప్రదర్శించిన వైనంపై చాలా మంది పురుషులు గొప్పలు చెప్పుకున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
దాదాపు 800 మంది పురుషులను పరిశోధకులు తమ అధ్యయానికి ఎంచుకున్నారు. వారి లైంగిక అలవాట్లపై, తమ మహిళలతో సెక్స్ చేసిన తర్వాత తమ మగతనం గురించి ఏమనుకుంటున్నారనే విషయాలపై వారు ప్రశ్నలు వేశారు.
ఎక్కువ మంది పురుషులు అలా...
పడకగదిలో తమ సామర్థ్యం గురించి, తమ మగతనం గురించి ఎక్కువ మంది పురుషులు మాట్లాడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. స్త్రీని శృంగారంలో సంతృప్తిపరచగలిగే మగాడు తనకు మించి ఉండడనే అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంటుంది.
స్త్రీ ఎలా రియాక్ట్ అవుతుంది...
శృంగారంలో పాల్గొన్న తర్వాత, ఆ అనుభూతిలో ఉన్న మహిళ తమ భాగస్వామి అహంకారపూరితమైన వ్యాఖ్యలపై, తామేదో చెమటోడ్చి భావప్రాప్తి కలిగించామనే మాటలపై తీవ్రమైన చిరాకు ప్రదర్శిస్తుందని అంటున్నారు. శృంగారానికి సంబంధించిన ఆనందంలో తేలిపోతుంటే మగాడు అలా మాట్లాడడం ఆమెకు ఏ మాత్రం ఇష్టం ఉండదని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నా అంతవాడు లేడనే...
మగాళ్లు స్త్రీలను శృంగారంలో సంతోషపెట్టడంలో తమను మించినవారు ఉండరనే భావనతో ఉంటారు. చాలా మంది తమ సెక్స్ సామర్థ్యంతో స్త్రీకి భావప్రాప్తి కలిపించగలుగుతున్నామని, తామంటే స్త్రీలు పడిపోతారని భావిస్తూ ఉంటారు. తమ మహిళా భాగస్వామి ఏమనుకుంటుందనే విషయాన్ని పట్టించుకోరు.
స్త్రీ ఎలా ఫీలవుతుంది....
సెక్స్‌లో తన పురుషుడు ఆనందాన్ని కలిగిస్తే స్త్రీ ఆ పరవశంలోనే ఎక్కువ సేపు ఉంటుంది. అతన్ని ముద్దాడుతుంది. అతని చెంపలపై సున్నితంగా కొడుతుంది. అయితే, వీటిని మగాళ్లు భరించగలుగుతారా అనేది సందేహమేనని అంటున్నారు.