మీ భాగస్వామితో రతిక్రీడను అదరగొట్టిన తర్వాత మీరు ఏం చేస్తున్నారనేది అత్యంత ముఖ్యమైన విషయం. రతిక్రీడలో పతాక స్థాయికి చేరుకుని భావప్రాప్తి పొందిన తర్వాత వెనక్కి తగ్గడం అనేది మామూలు విషయం. మీరు రతిక్రీడను ఎంతగా ఊపేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఆనందం ఆవిరై పోతుంది.
రతిక్రీడ ముగించిన తర్వాత ఓ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించడమో, టీవీ పెట్టుకుని చూస్తుండడమో, ఫోన్‌లో మరెవరితోనో మాట్లాడుతుండడమో, మరో పడకపైకి వెళ్లి పడుకోవడం చేస్తే మీ భాగస్వామిని తీవ్ర నిరాశకు గురి చేసినట్లే. అది అంత వరకు మీ భాగస్వామికి అందించిన ఆనందాన్ని ఏదో మేరకు దూరం చేయడమే అవుతుంది.
పడక గదిలో మీరు మీ భాగస్వామికి తృప్తి కలిగించే విధంగా రతిక్రీడను సాగించినా చిన్న చిన్న పొరపాట్లు ఆనందాన్ని పటాపంచలు చేస్తాయి. రతిక్రీడ ముగిసిన తర్వాత లైంగికేతర చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది మీ లైంగిక భాగస్వామితో ఆ చర్యలను ఆచరించాలి. సంభోగం ముగిసిపోగానే ఆ భావన నుంచి బయటపడితే మీ భాగస్వామిని నిరాశలో ముంచినవారతవుతారు. సంభోగం తర్వాత చేసే పొరపాట్లను సరిదిద్దుకోవాలి.

రతిక్రీడ ముగియగానే వెంటనే నిద్రలోకి జారుకోకూడదు. ఇద్దరూ ఒకేసారి అలా నిద్రలోకి జారిపోతే సమస్య లేదు గానీ ఒకరు నిద్రలోకి జారిపోయి మరొకరు మెలుకువతో ఉంటే సమస్య అవుతుంది. మెలుకువతో ఉన్న భాగస్వామి తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. రతిక్రీడ తర్వాతి ఆనందాన్ని ఇద్దరు పంచుకుంటే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.

ఫోర్ప్లేలో భాగంగా దంపతులు ఇద్దరు వేడి నీళ్ల స్నానం కలిసి చేస్తే రంజుగానే ఉంటుంది. కానీ, సంభోగంలో ఓ పట్టు పట్టి అది ముగియగానే బాత్రూంలోకి పరుగులు తీస్తే మీ భాగస్వామి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామి ఇంకా మూడ్లో ఉండగానే ఆ పని చేయకూడదు. ముద్దులు పెట్టడం, ఆలింగనం చేసుకోవడం వంటి చర్యలకు దిగితే మీ భాగస్వామి ఆనందించే అవకాశం ఉంటుంది.

రతిక్రీడ ముగిసిన తర్వాత పురుషులు చాలా మంది తమ మిత్రులకు ఫోన్లు చేసి, వ్యవహారాలు ముచ్చటిస్తుంటారు. మహిళ అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. దాంతో ఆమెలో నిరాశ చోటు చేసుకుంటుంది. అందవల్ల వెంటనే ఫోన్లు చేసి, మాట్లాడే పద్ధతికి స్వస్తి చెప్పాలి. నిజానికి, మొబైల్స్ను దూరంగా పెట్టాలి.

రతిక్రీడ ముగియగానే చదువుకోవడమో, పనిచేసుకోవడం మొదలు పెడితే కూడా మీ భాగస్వామిని నిరుత్సాహ పరిచినవారు అవుతారు. సెక్స్ తర్వాతు కూడా భాగస్వామితో కలిసి ఆనందించే అవకాశాలు చాలా ఉంటాయి. రతిక్రీడ తర్వాత మీ భాగస్వామిని సంతోషపెడితే ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

కొంత మందికి పడకగదిలో విడిగా పడుకునే అలవాటు ఉంటుంది. రతిక్రీడ ముగియగానే అలా వేరే పడక మీదికి జారుకుంటున్నారంటే తప్పు చేసినట్లే. రతిక్రీడ తర్వాత మీ భాగస్వామితో సరససల్లాపాలు సాగిస్తే ఇరువురి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది.

రతిక్రీడ తర్వాత వెంటనే పిల్లలను తమతో పాటు పడుకోబెట్టుకవడానికి తెచ్చుకోకూడదు. చాలా మంది మహిళలు తమ పిల్లలను తెచ్చుకుని పక్కన పడుకోబెట్టుకుంటారు.

రతిక్రీడకు ముందు దంపతులు ఇరువురు కలిసి భోజనం చేయడం ఆనందంగా ఉంటుంది. రతిక్రీడ ముగిసిన వెంటనే కిచెన్లోకి పరుగెత్తడం సరి కాదు. ఏదో ఒకటి తినడానికి వెళ్లడం వల్ల మీ భాగస్వామి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.