వాట్సన్ తిరిగి శృంగారంలో అదరగొట్టడానికి అనుసరించాల్సిన పద్దతులను వివరించినట్లు హాంఫిగ్టన్ పోస్టు రాసింది. శృంగారం పట్ల ఆసక్తి తగ్దడానికి మూల కారణం ఏమిటనేది ముందు గుర్తించాల్సి ఉంటుంది. అందుకు గల శారీరక, మానసిక కారణాలను విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.
దంపతుల మధ్య అనుబంధం పెనవేయడానికి పరస్పర స్పర్శ, లైంగిక క్రీడ అవసరమని వాట్సన్ అంటున్నారు. ఎల్లవేళలా మన శరీరం కామవాంఛతో రగిలిపోక పోవచ్చు. కామవాంఛ తక్కువగా ఉన్న మహిళలో కూడా అది ఎప్పుడైనా రగలవచ్చు.
శృంగారం పట్ల అనాసక్తి ప్రదర్శించే మీ జీవిత భాగస్వామితో పడక గదిలో కాకుండా విడిగా మాట్లాడండి. డిన్నర్ టేబుల్ వద్దనో, ఇద్దరూ కలిసి నడుస్తున్నప్పుడో సంభాషించండి. క్లిష్టమైన సమస్య గురించి మాట్లాడదలుచుకున్నట్లు ముందే చెప్పండి. దాని వల్ల ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి ఆమె సిద్ధపడుతుంది. ఆమె అభిమానం దెబ్బ తినే విధంగా మాట్లాడవద్దు. నిజాయితీగా, చిత్తశుద్ధితో సమస్యను వివరించండి.
మీ కోరికను సానుకూల కోణం నుంచి వివరించండి. ఆమె వాడుతున్న మందులు ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోండి. వాటి ప్రభావం వల్ల కామవాంఛ తగ్గవచ్చు. అప్పుడు వైద్యుడితో మాట్లాడి వాటి ప్రభావం గురించి వివరించండి.
సంబంధాల్లో ఒత్తిడి కూడా దంపతులను పడకగదికి దూరం చేయవచ్చు. అటువంటప్పుడు థెరపిస్టును సంప్రదించాల్సి ఉంటుంది. లైంగికేతర సమస్యలు శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే థెరపిస్టు పరిష్కారం చేసే అవకాశం ఉంది. మానసిక సమస్యలను తొలగించడానికి సంభాషణ బాగా పనికి వస్తుంది.
దాపరికం లేకుండా నిజాయితీగా మాట్లాడడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. ఆమెలో కామోద్రేకాన్ని కలిగించడానికి కొత్త పద్ధతులు, కొత్త ప్రదేశాలు చూడండి.