శృంగార పురుషులను మహిళల రొమ్ముల సైజు ఎక్కువగా ఆకట్టుకుంటుందట. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. రొమ్ము సైజులు, మగాళ్ల ప్రవర్తన అనే అంశంపై వెస్ట్‌మినిష్టర్ విశ్వవిద్యాలయం ఓ అధ్యయం చేసింది. పరిశోధకులు 361 మంది శ్వేత జాతీయులను, హెటిరోసెక్సువల్ మెన్‌ను ఇంటర్వ్యూ చేశారు. వారి వయస్సు 18 నుంచి 68 మంది ఉన్నారు.
ప్రతి మగాడికి ఐదు భిన్నమైన 3-డి మోడల్స్‌ను పరిశోధకులు చూపించారు. మోడల్స్‌ వక్షోజాల సైజు భిన్నంగా ఉన్నాయి. వాటిని చూపించి ఏ మహిళ శారీరకంగా ఆకర్షణీయంగా ఉందని పరిశోధకులు వాళ్లని అడిగారు.
మహిళ పట్ల ప్రతి పురుషుడు చూపించిన ఆసక్తిపై సర్వే నిర్వహించారు. స్త్రీపురుషుల మధ్య సంబంధాలు, బెనోవెలెంట్ సెక్సిజం, మహిళను చూస్తున్న తీరుపై ఈ సర్వే జరిగింది. మీడియం సైజు రొమ్ములు ఉన్న ఆడవాళ్లపై 32.7 శాతం మంది పురుషులు మోజు చూపించారు.
బరువైన వక్షోజాలు ఉన్న మహిళలపై 24.4 శాతం మంది, అత్యంత బరువైన వక్షోజాలు ఉన్న మహిళలపై 19.1 శాతం మంది, చిన్న సైజు రొమ్ముల స్త్రీలపై 15.5 శాతం మంది, మరీ చిన్న రొమ్ములున్న మహిళలపై 8.3 శాతం మంది ఆసక్తి ప్రదర్శించారు.
బరువైన, అతి బరువైన రొమ్ములున్న మహిళల పట్ల ఆసక్తి చూపించడానికి, ఓవర్ట్ (బహిరంగ) సెక్సిజానికి, బెనెవోలెంట్ సెక్సిజానికి సంబంధం ఉన్నట్లు తేలింది. రొమ్ములు సైజును ఆడతనానికి సంకేతంగా కూడా పురుషులు పరిగణిస్తున్నట్లు తేలింది. భారీ సైజు రొమ్ములు స్త్రీల ఆడతనానికి పురుషులు నిదర్శనంగా చూస్తున్నారన్న మాట.