రతిక్రీడలో చేతులను, వేళ్లను, పెదవులను, ముక్కును, జననాంగాలను వాడడం సర్వసాధారణం. అయితే, శృంగారంలో ఓ పట్టు పట్టి, ఊగిపోవడానికి నోటిని కూడా వాడవచ్చు. నోటిని వాడి మీ భాగస్వామిని మత్తులో ముంచెత్తే మార్గాలు కూడా ఉన్నాయి.
లోతుగా ముద్దు..
ముద్దు అనేది స్త్రీపురుషులను ఇద్దరిని మూడ్‌లోకి తీసుకుని వెళ్తుందనే విషయంలో సందేహం లేదు. అయితే, కేవలం ఇలా ముద్దు పెట్టేసి ఊరుకోకుండా తడి పెదవులను, నోటిని వాడి మరింత గట్టిగా, లోతుగా ముద్దు పెట్టుకోండి. నాలుకను ఉపయోగించి, ముద్దును ఓ సుదీర్ఘ క్రియగా మార్చండి. నోటినీ నాకడం, చీకడం మార్చిపోకండి.
చెవుల వెనక, మెడను నాకండి..
సున్నితమైన అంగాల ద్వారా మీ భాగస్వామిలో కామోద్దీపనం పెంచవచ్చు. మెడ, చెవుల వెనక భాగాలు, పిరుదులు, తొడలు మొదలైన భాగాలను విస్మరించవద్దు. ఆ భాగాలపై ముద్దులు పెట్టవచ్చు, వాటిని మీ నోటితో, నాలుకతో కుడచడం, నాకడం చేయండి. అది మీ భాగస్వామి మరింత రెచ్చిపోయేలా చేస్తుంది.
కిందికి జారండి..
రతిక్రీడ మన్మథ సామ్రాజ్యాన్ని ఏలాలంటే నోరు అత్యంత ముఖ్యమైందే. ముఖ రతి (ఓరల్ సెక్స్) వంటివి మీ భాగస్వామిని రతిక్రీడలో ఉర్రూతలూగిస్తుంది. నోటిని వాడుతున్నప్పుడు మీ భాగస్వామి కింది భాగాలను కూడా గుర్తుంచుకోండి.
గట్టిగా ముద్దు పెట్టండి..
దంపతులు ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా పెదవులు చీకుతున్నప్పుడు నాలుకతో రెచ్చగొట్టవచ్చు. లిక్కింగ్ ద్వారా కామోద్దీపన పెరుగుతుంది. గట్టిగా, మత్తులో ఊగుతూ సొమ్మసిల్లే విధంగా అది ఉండాలి.
వీపుతో ఆడుకోండి...
వీపు అత్యంత సున్నితమైన భాగమే. నోటితో దాన్ని లిక్ చేస్తూ ఉంటే మీ భాగస్వామి కోరికతో ఎగిరెగిరి పడుతుంది. ఆమె లేదా అతను బోర్లా పడుతునేలా చేసి వీపుతో ఆడుకోండి. మీ నాలుకను, వేళ్లను పూర్తి స్థాయిలో వాడితే మీ భాగస్వామిలో కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి.