రాత్రి మాత్రమే దంపతులు శృంగారంలో పాల్గొనాలని, అది కూడా పడక గదికి మాత్రమే పరిమితం కావాలని కొంత మంది అపోహ పడుతుంటారు. సృష్టి కార్యమైన రతిక్రీడకు వేళపాలా అక్కరలేదని అంటున్నారు నిపుణులు. అది దంపతుల మనోభావాలను బట్టి, సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
ఉదయం పూట కొంత మంది మాత్రమే శృంగార క్రీడను ప్రయత్నిస్తారు. తెల్లవారు జామును శృంగార క్రీడ మత్తును ఇస్తుంది. పైగా, పురుషుడి అంగం ఆ వేళ గట్టిగా ఉంటుంది. ఒకరి తర్వాత మరి ఒకరు లేచి అందుకు సిద్ధం కావచ్చు. ఉదయం వేళ రతిక్రీడ జరిపి స్నానపానాదులు ముగిస్తే రోజంతా హాయిగా, ఉల్లాసంగా గడిచిపోతుంది.
రాత్రి పూట దీర్ఘ నిద్ర తర్వాత మధ్యలో రతిక్రీడ కూడా బాగుంటుందని అంటున్నారు. ఇది కూడా రతికి మంచి సమయం. అది ఆదివారం మధ్యాహ్నమైనా లేక వారంలో ఉదయమైనా ఇది బాగానే వుంటుంది. దాని వల్ల కలిగే రుచికి మీరే ఆశ్చర్యపోతారు.
నిద్ర తర్వాత వేడి నీటి స్నానం హాయిని, ప్రశాంతతను చేకూరుస్తుంది. మనస్సు తేలికగా ఉంటుంది. కొత్త రుచుల ఆస్వాదనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్నానం తర్వాత రతికి మంచి సమయమే. ఇంకా చెప్పాలంటే, దంపతులు కలసి స్నానం చేస్తే ఆ మజాయే వేరు. అలసి సొలసి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే శరీరం బరువు దిగి రతిక్రీడకు అనుకూలంగా ఉంటుంది.
దంపతులిద్దరికీ మూడ్ ఉంటే, సమయం, సందర్భం, స్థలం చూసుకోనక్కరలేదు. ఒకరికి ఉరకలు వేస్తుంటే మరొకరికి వద్దనిపిస్తే అంత మంచిది కాదు. అటువంటి సందర్భంలో రతిక్రీడ చప్పగా మిగిలిపోయే అవకాశం ఉంది.