లైంగిక క్రీడ దంపతుల్లో ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు పదే పదే చెబుతున్నారు. లైంగిక క్రీడ వల్ల మనసు తేలిక పడుతుంది. శారీర, మానసిక బంధం గట్టి పడుతుంది. ఎండోఫ్రిన్ విడుదల వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని నిపుణులు తేల్చారు. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు మనసు శృంగారం వైపు కూడా వెళ్లదు. అలాంటి సమయాల్లో లైంగిక క్రీడకు సిద్ధం కావడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాం.. చూడండి

ఆఫీసు నుంచి ఇంటికి రాగానే అలసట చుట్టుముడుతుంది. అటువంటి సమయంలో తీరిగ్గా కూర్చోండి. కాసేపు ధ్యానం చేయండి. దాంతో మనసు తేలిక పడుతుంది. పాదాలకు మసాజ్ చేసుకోండి లేదా వేడి నీళ్లలో పాదాలను కాసేపు ఉంచి విశ్రాంతిగా కూర్చొండి. ఆ రకంగా రికాల్స్ అయితే లైంగిక క్రీడకు మనసు సమాయత్తమవుతుంది.

లైట్‌గా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. అలసట ఉన్నప్పుడు హెవీ ఫుడ్ వల్ల నిద్ర ముంచుకొస్తుంది. గోధుమ పిండి పదార్థాలు, కూరగాయలు, తాజా ఫలలు విటమిన్స్‌తో కూడిన పోషకాహారాన్ని ప్రసాదిస్తాయి. ఫైబర్ శక్తికి ఎంతో అవసరం. ఓ గ్లాసెడు పాలు సేవిస్తే మంచిది.

ఇంటికి రాగానే చిన్నపాటి కునుకు తీయండి. అది 20 -30 నిమిషాలకు మించి ఉండకూడదు. ఎక్కువ సేపు కునుకు తీస్తే మీ భాగస్వామి నిరాశకు, నిస్పృహకు గురయ్యే అవకాశం ఉంది. మొబైల్‌ను, లైట్లను ఆఫ్ చేసి మీ భాగస్వామికి మీ పక్కన చోటివ్వండి.

చల్లటి నీళ్ల స్నానం మీ బద్దకాన్ని వదిలిస్తుంది. వేడి నీళ్లు మీ శరీరానికి, మెదడుకు రిలాక్స్ కలిగిస్తుంది. రెండింటినీ ప్రయత్నించి మీకు ఏది బాగుందో చూసుకోండి. లావెండర్ బాడీ వాస్‌ను కూడా రిలాక్స్ కోసం వాడొచ్చు. మీరు లైంగిక క్రీడకు పూర్తిగా సమాయత్తమవుతారు.

చిన్నపాటి నడక మీకు రిలాక్స్‌ను ఇస్తుంది. వేగంగా నడవకూడదు. అది మీ శరీరంపై, మనసుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు కేవలం 20 నిమిషాల పాటు వాక్ చేయండి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో చప్పుళ్లు మరింతగా మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి.

మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న విషయాలపై మీ భాగస్వామితో మాట్లాడండి. తద్వారా మూవీ లైక్ సెక్స్‌కు సిద్ధం కండి. మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలపై భాగస్వామితో మాట్లాడడం వల్ల బరువు దిగిపోయి, మనసు తేలికపడుతుంది. దానివల్ల మీ భాగస్వామితో ఉద్వేగభరిత అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చు. ఆ తర్వాత రతిక్రీడకు మీ అంతట మీరే సిద్ధపడే వాతావరణం ఏర్పడుతుంది.

మీ భాగస్వామితో సరదాగా మాట్లాడండి, సరదాగా వ్యవహరించండి. దానికి ముందస్తు ప్రణాళిక అవసరం లేదు. మీకు సంతోషాన్ని ఇచ్చే, మీ భాగస్వామిని ఉల్లాసపరిచే సరదా సయ్యాటలు సాగించండి. ఆ సమయంలో సెక్స్ కోసం ప్రత్యేకమైన భంగిమ కోసమో, పద్ధతి కోసమో చూడకండి. మీకు నచ్చిన పద్ధతిలో లైంగిక క్రీడను సాగించండి. మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోండి, అతన్ని లేదా ఆమెను కౌగిలిలో బంధించండి. ఏది సరదా అనిపిస్తే మీ భాగస్వామి ఈగోను దెబ్బ తీయకుండా అది చేయండి.