మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం వంటివాటి వల్ల స్పెరెటోజోవా క్షీణిస్తుందని అంటున్నారు. ఆ దురలవాట్లు ఉండడం వల్లనే వీర్యకణాల స్రావం సరిగా జరగడం లేదని గుర్తించాల్సి ఉంటుంది. భౌతిక చర్యల ద్వారా, అంటే శరీరానికి వ్యాయామం ఇవ్వడం ద్వారా లైంగిక హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి చెప్పారు.
ఎఫ్ ఎస్... హెచ్ ఎ (పుటం - స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్.. హెచ్. (ల్యూటినైజింగ్ హార్మోన్), టెస్టోటిరోన్, కార్టిక్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు స్పెర్మటోజోవా వృద్ధికి తోడ్పడతాయని అధ్యయనంలో తేలింది. 31 మంది పురుషులపై అధ్యయనం చేసి పరిశోధకులు ఈ విషయం చెప్పారు. వ్యాయామం వల్ల హార్మోన్లు సరైన నిష్పత్తిలో విడుదలవుతాయని చెబుతున్నారు.
వ్యాయామం వల్ల హార్మోన్ స్థాయిలు మెరుగ్గా ఉండి, వీర్యకణాల ప్రమాణం, పరిణామం పెరుగుతుందని, పునరుత్పత్తి స్థాయి పెరుగుతుందని అంటున్నారు. దానికి తోడు, ప్రతి రోజూ లైంగిక క్రీడలో పాల్గొనడం వల్ల నాణ్యమైన వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందని అంటున్నారు.