•  

రతిక్రీడ: కలిసి స్నానిస్తే కలదు సుఖం

దంపతుల మధ్య లైంగిక జీవితం రుచిపచి లేకుండా సాగుతున్నప్పుడు కొత్త మార్గాలు వెతుక్కోవాలి. రొటీన్‌గా మారిపోతే కొత్తరకంగా ఆనందాన్ని జుర్రుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు కలిసి స్నానం చేయడమనేది అత్యంత ముఖ్యమైంది. రొటీన్‌కు భిన్నంగా పలు రకాల పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే దాంపత్య జీవితం మరింత బలపడుతుంది.



bath together to spiceup romance
 



ముఖ్యంగా రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే రతిక్రీడలో అంతకుముందుకంటే ఎక్కువ ఆనందాన్ని చవిచూస్తారని చెపుతున్నారు. అయితే కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును ప్రదర్శిస్తుందనీ, అయితే పురుషుడు కాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని పరిశోధకులు అంటున్నారు.



ముఖ్యంగా కలిసి స్నానం చేసే సమయంలో అంతకుముందు మనసులో, తనువులో ఏదైనా సిగ్గు, బిడియం ఉంటే అది కూడా పోతుందనీ, ఫలితంగా సెక్స్ సుఖాన్ని పూర్తిస్థాయిలో ఆనందించగలుగుతారని చెపుతున్నారు. బాత్‌రూమ్‌లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.



అంతేకాదు... స్నానం చేసే సమయంలో విభిన్నమైన ఆలోచనలతో ఒకరి తనువులో అందాలను మరొకరు పొగడ్తలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుందని చెబుతున్నారు.

English summary
Making love in water is one of the most appealing things this season. As monsoons are going to hit, it is time to try up something that makes sex in the rain or bath tub an excellent experiment. Couples would love enjoying sex in the bathroom.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras