•  

డిన్నర్ కు ధేంక్యూగా... ఈ పని?

<ul id="pagination-digg"><li class="next"><a href="/2012/07/why-you-need-two-people-romance-000836.html">Next »</a></li></ul>

మహిళలు రతిక్రీడలో పాల్గొనేది... ప్రేమానురాగాలకొరకు, తమ వాంఛ కొరకే కాదు, లైంగికేతర కారణాలుగా కూడా రతిక్రీడను కోరతారు. విసుగుపుట్టిన వారి దైనందిన జీవితం, పాపం పురుషుడు అంటూ మగవాడిపై సానుభూతి, వారికిగల మైగ్రేన్ వంటి తీవ్ర తలనొప్పులు పోగొట్టుకోడానికి కూడానని ఒక పుస్తకం వెల్లడి చేస్తోంది. ఈ పుస్తకంలో రొమాంటిక్ అవసరాలను పక్కనపెడితే, మహిళలకు గల శారీరక, మానసిక ఇతర కారణాలు సుమారు 200 వరకు రచయితలు సింటే మెస్టన్, డేవిడ్ బస్ లు వివరించారు. ఆకర్షణ అనే అంశం జాబితాలో చివర ఎక్కడో వుందట. వీరికిగల కారణాలలో పురుషుడు ఆమెకు ఇచ్చే మంచి డిన్నర్ కు ధ్యేంకూ గా కూడా వారు రతిక్రీడ సాగించేస్తారట.



Why You Need Two People in Romance?
 

రీసెర్చిలో చాలామంది పురుషులు చాలామంది మహిళలను కనీసం ఒకమాదిరిగా సెక్సీగా ఆకర్షిస్తున్నావని ప్రశంసించారట. కానీ మహిళలు మాత్రం తమ పురుషులు సెక్సువల్ గా తమను ఆకర్షించటంలేదని తెలిపినట్లు టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై టెక్సాస్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్లు షుమారు 1,006 మంది మహిళలను రీసెర్చి చేసి ఆశ్చర్యపోయే సమాధానాలను రాబట్టారట. ఒక మహిళ సంభోగం అనేది భగవంతుడికి దగ్గరగా తీసుకు వెళుతుందనే కారణంగా ఆధ్యాత్మిక అనుభవం కొరకు సంభోగిస్తున్నానని, మరో మహిళ తన తలనొప్పికి చికిత్సగా రతిక్రీడ ఆచరిస్తానని, మరో మహిళ, తనకు మంచి చర్మ కాంతి రావాలని, మరో మహిళ తన రతిక్రీడ నైపుణ్యం పెంచుకోటానికి రతి చేస్తున్నానని, తెలిపారట.

84 శాతం మంది మహిళలు తమ భాగస్వామితో జీవితం ప్రశాంతంగా గడవటానికిగాను తాము రతికి సిద్ధమైనట్లు తెలిపారట. కొన్ని సమాధానాలలో పురుషులమీద జాలికొద్దీ కూడా రతికి ఒప్పుకుంటున్నట్లు తెలిసింది. పదిమందిలో ప్రతి ఒక మహిళ మాత్రం, పురుషుడు ఇచ్చే బహుమతులకు బదులుగా లేదా మంచి స్టార్ హోటల్ డిన్నర్ పొంది, లేదా విలాసవంతమైన జీవితాన్ని అందించినందుకు, దానికి ప్రతిఫలంగా కూడా అందుకు అంగీకరించేస్తున్నారట.

<ul id="pagination-digg"><li class="next"><a href="/2012/07/why-you-need-two-people-romance-000836.html">Next »</a></li></ul>

English summary
Feelings of Romance differ from person to person. No two persons will have same feelings at same time. All in all, make sure you take some time and really analyze yourself and your body, your needs and your desires, and that way you will manage to understand the course of action you have to take so that every
Story first published: Thursday, July 12, 2012, 15:14 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras