మీరు రతి చేసేటపుడు ఎంతో సంతోషంగానే వుంటారు. కాని ఒత్తిడి ఉంటుంది. ఇది జంటలలో మొదటి సారి చేసేటపుడు సాధారణమే. కాని ఎందుకు? ఎందుకంటే, దీని వెనుక ఎన్నో అపోహలుంటాయి. అవి మిమ్మల్ని భయపెడతాయి. మరల పిరీయడ్ వచ్చేంతవరకు మీకు భయంగానే ఉంటుంది. మొదటిసారి రతిలో కలిగే అపోహలు సాధారణంగా ఎలావుంటాయో పరిశీలించండి.
రక్తస్రావం తప్పక ఉంటుంది - మొదటి రతిలో రక్తస్రావం తప్పకుండా ఉండాలని లేదు. మహిళలు అందరికి స్రావం కాదు. రక్తస్రావం అనేది మహిళ కన్నె అనేదానికి నిదర్శనంగా పురుషులు భావిస్తారు. కన్నెపొర చినిగితే, మహిళ రక్తస్రావం చేసుకుంటుంది. ఇది ఆమెను కన్నెగా నిరూపిస్తుంది. అయితే, వాస్తవం ఏమంటే, మహిళలు వారి కన్నెత్వాన్ని చాటుకోటానికి రక్తస్రావం చేయాల్సిన అవసరం లేదు. క్రీడలలో పాల్గొనటం, లేదా కన్నెపొరలో రక్తనాళాలు లేకుండటం వంటివి రక్తస్రావం కలిగించవు. కనుక, ఈ అపోహలపై ఆధారపడకండి. మొదటి రతి తర్వాత అందరు మహిళలు రక్తస్రావం చేయరు.
అది బాధాకరం - మొదటి రతి బాధాకరమని అపోహ కలిగివుంటారు. గట్టిగా పొడవుగా వుండే అంగం తమ యోనిలోకి దిగపడుతోంది అని భయపడతారు. కాని ఇది అపోహ మాత్రమే. అందరి మహిళలకు రక్తస్రావం కాదు. అలానే అందరి మహిళలకు కన్నెపొర ఖచ్చితంగా ఉండదు. కన్నెపొర గట్టిగా వుంటే, సెక్స్ బాధాకరం. కాని సైకిలింగ్, గుర్రపు స్వారి, మార్షల్ ఆర్ట్స్ వంటివి కన్నెపొరను తొలగించి మొదటి రతి తక్కువ నొప్పి ఉండేలా కూడా చేస్తాయి. కనుక వర్రీ కాకండి. రతి బాధాకరంగా వుంటే, మెల్లగా చేయించుకోండి.
యోని మంట, బాధ ప్రమాదం - మొదటి రతి తర్వాత యోని మంట, నొప్పి వుంటుందని చెపుతారు. మూత్రం సమయంలో ఇవి వస్తాయి. ఇది అపోహ. అయితే, రతిలో అంగంచే చొప్పించబడిన యోని కొద్ది రోజులు మంటగానే ఉంటుంది. అంగం బాగా తగిలించడం వలన యోని మండుతుంది. మరి యోని పొడిబారి ఉంటే, మరింత మంటగా ఉంటుంది. కనుక ఏదేని క్రీములు వాడి మొదటి రతి చేస్తే, ఈ సమస్య ఉండదు. అయితే, ఈ మంట కనుక ఒక వారంపైన కొనసాగితే, డాక్టర్ ను సంప్రదించండి.
సెక్స్ తర్వాత మూత్రంపోస్తే గర్భం రాదు - ఇది కూడా అపోహ. కండోమ్ లేకుండా రతి చేస్తే? మొదటి సారి రతి చాలా వరకు ఏ రకమైన కండోమ్ వంటివి లేకుండా జరుగుతుంది. పురుషులకు వారి స్కలనంపై నియంత్రణ ఉండదు. చాలావరకు స్కలనం ఆమెకు యోనిలోనే అవుతుంది. కనుక మూత్రం వెంటనే చేస్తే, లోపల వున్న వీర్యం బయటకు వచ్చేస్తుందని ఇక గర్భం రాదని భావిస్తారు. అయితే మూత్రం వచ్చేది మూత్రాశయం నుండి. వీర్యం మూత్రాశయం ద్వారా గర్భ సంచికి వెళ్ళదు. వీర్యం గర్భ సంచిలోకి నేరుగా వెళ్ళిపోతుంది. మూత్రాశయం వేరుగాను, గర్భ సంచి వేరుగాను వుంటాయి. ఏ అవయవం చర్య అది చేసుకుంటూ పోతుంది. కనుక తగిన సురక్షిత సాధనాలు మొదటి సెక్స్ లో కూడా వాడాలి.
మొదటి రతిపై మరిన్ని అపోహలు మీకు తెలిస్తే వాటి వాస్తవాలను మాకు వ్రాసి మాతో పంచుకోండి.