రతిక్రీడ చాలామంది జంటలకు అలవాటుగా వుంటుంది. అందులోని ఆనందం వారిని దానికి ఏసమయమైనా సరే అలవాటు చేసేస్తుంది. అయితే, ఒక మహిళ చాలా సార్లు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతూంటుంది. ప్రధానంగా పిరీయడ్స్, ఇన్ ఫెక్షన్స్ వంటివి ఆమె లైంగిక జీవితాన్ని ప్రభావిస్తూంటాయి. ఆమెకు ఎంత అసౌకర్యం అయినా, బాధ కలిగినా పట్టించుకోని పురుషులు కూడా వున్నారు. వారు తలచింది తప్పక చేస్తారు. వద్దంటున్నా వినకుండా పిరియడ్స్ లో పాల్గొని మరింత అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతారు. ఇక అటువంటి పురుషులున్నపుడు, స్త్రీలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారికి ఏ కారణం లేకుండానే అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. పిరీయడ్ సమయంలో మహిళకు రతిచేయటం మంచిదే అని కొంతమంది చెపుతారు. ఆ సమయంలో ఆమెలో కోర్కెలు సైతం అధికంగా వుంటాయి. ఆమె గర్భాశయం నొప్పితో కూడా వుంటుంది. ఈ సమయంలో సమర్ధవంతంగా చేసే రతి ఆమెకు కొంత ఊరటనిస్తుంది. అయితే, రతిసమయంలో ఆమె ఆరోగ్యపరర జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా శుభ్రత వుండాలి. మరి మహిళ తన పిరీయడ్ సమయంలో రతికి సిద్ధ పడేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు పరిశీలించండి.
మహిళ గుర్తుంచుకోవలసిన ముందు జాగ్రత్తలు
ప్రెగ్నెన్సీ - పిరియడ్ లో ప్రెగ్నెంట్ కారనే అభిప్రాయం చాలా మందికి వుంటుంది. పిరియడ్ లో రతి అయినప్పటికి జంటలు గర్భం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కండోమ్ వంటివి లేకుండా ఈ సమయంలో రతి చేస్తే ఆమెకు గర్భం రావటమే కాక, సుఖ వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా వస్తాయి. కనుక మీరు చేసే రతి సురక్షితంగాను ఆరోగ్యకరంగానను వుండాలి. శుభ్రత విధానాలు ఆచరించండి. అందుకుగాను పార్టనర్ కూడా శ్రద్ధ చూపాలి.
శుభ్రత - మహిళ జననాంగం ఎలా వున్నప్పటికి పట్టించుకోని పురుషులు వుంటారు. వారికి రతి చేయటమే ప్రధానంగా వుంటుంది. శుభ్రత అనేది వ్యక్తిగత అంశం. పురుషులు రక్తం చూస్తే చాలు భయపడతారు. కనుక మహిళలు పిరియడ్ లో రతిచేస్తే, తమ జననాంగాలు వీలైనంత శుభ్రంగా వుండేలా చూసుకోవాలి. బెడ్ చేరే ముందు స్నానం చేయండి లేదా మీ శానిటరీ నాప్ కిన్ మార్చండి. ఈ చర్య మీ ఇద్దరిని సౌకర్యంగా వుంచుతుంది.
పిరియడ్ లో మహిళకు వచ్చే నొప్పులు - మీరు పిరియడ్ లో సెక్స్ చేయదలిస్తే, చాలా జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే, పిరియడ్ అయిన మొదటి రెండు రోజులు పొత్తికడుపు నొప్పి వుంటుంది. ఈ సమయంలో సెక్స్ చేస్తే మహిళకు మరింత నొప్పి పెడుతుంది. దానికి కారణం ఆమె సంతానోత్పత్తి వ్యవస్ధ బలహీనపడుతుంది. రక్తం బయటకు రావడంతో నొప్పులు వస్తాయి. మొదటి లేదా రెండవరోజు పిరియడ్ నాడు రతి చేస్తే, అంగం అతి మెల్లగా యోనిలోకి ప్రవేశ పెట్టాలి. ఆమెకు నొప్పి అనిపిస్తే, ఇక ఆ చర్య విరమించండి. రెండు మూడు రోజులు ఆమెకు విశ్రాంతి కలిగించండి.
భావప్రాప్తి - పిరియడ్స్ లో రతి చేసేవారు వీలైనంతవరకు రతిలో భావప్రాప్తి లేదా స్కలనం చేయకుండా చూడాలి. నేరుగా చేసే అంగప్రవేశం ఆమె సంతానోత్పత్తి వ్యవస్ధను ఆ సమయంలో బలహీనపరుస్తుంది. మొదటిలో ఆనందంగానే వుంటుంది కాని మీరు స్కలనం చేసినపుడు బెడ్ షీటు నిండా రక్తపు మరకలు పడతాయి. అది చాలా చికాకుగావుంటుంది. మీరు కనుక స్కలన దశకు కూడా చేరితో నొప్పులు అధికం అవుతాయి.
పిరియడ్ లో రతి చేసే సమయంలో మహిళ ఈ అంశాలు తప్పక గుర్తుంచుకోవాలి. వీలైనంతవరకు ఈ దశలో సెక్స్ చేయటం విరమించాలి. ఒక సారి రక్త స్రావం ఆగిపోతే, నొప్పులు తగ్గిపోతే, ఇక ఆపై రతిక్రీడ సంతోషంగానే వుంటుంది. పిరియడ్ తర్వాత చాలామంది స్త్రీలు తమలో యోని భాగంలో లూబ్రికేషన్ లేదని ఫిర్యాదు చేస్తారు. అటువంటపుడు నేడు మార్కెట్ లో లభ్యమయ్యే జల్ లేదా ట్యూబులు వాడి ఆనందించండి.