మీ మహిళ ఒక సారి గర్భవతి అయిందంటే, ఇక పడక జీవితానికి తాత్కాలికంగా బ్రేక్ పడిందన్నమాటే. కాన్పు అయి బిడ్డను జన్మించినప్పటికి మీకు వెంటనే లైంగిక జీవితం ఆచరించటానికి సాధ్య పడదు. అదే రకంగా పార్టనర్ కు హార్ట్ ఎటాక్ వచ్చిందంటే, పడక ఖాళీ అవుతుంది. కాని మీలోని కోర్కెలు ఎప్పటికపుడు విజృంభిస్త్తూనే వుంటాయి. ఈ రకమైన పడక సమస్యలు కొన్ని సార్లు తెగతెంపులకు, మోసాలకు లేదా పార్టనర్ల మధ్య ద్వేషాలకు కూడా దోవతీస్తాయి. మన లైంగిక జీవితాలను నాశనం చేస్తూ అనేక అంశాలుంటాయి. కాని మనం వాటిలో ప్రధానమైనవి చర్చిస్తూ వాటికి మంచి పరిష్కారాలను కూడా కనుగొంటున్నాం. అదెలాగో చూడండి.
బిడ్డ పుట్టిన తర్వాత లైంగిక జీవితం ఎలా వుంటుంది?
పిల్లలు పుట్టే సరికి జంటలలో అంతవరకు వున్న రొమాన్స్ ఏకారణం లేకుండానే రెక్కలు తెగి కిటికీనుండి పారిపోతుంది. అప్పటి వరకు ఒకరంటే మరి ఒకరికి ఎంతో ప్రేమ, ఊహలలో సైతం రతిక్రీడలే. కానీ ఇపుడు ఆ ఊమలు సైతం ఇపుడు బేబీ సంరక్షణకే చేస్తూ వుంటారు. అంతులేని కలలు బేబీపైనే కనేస్తారు. మీరంటే ఏమిటో మార్చేసుకుంటారు. ఒకప్పుడు మీరు ప్రేమికులు, ఇపుడు తల్లితండ్రులు. గతంలో మీ ఆలోచనలు, మీరు చేసిన పనులు ఎంతో మార్పు చెందుతాయి. కాని మీరు మరోమారు పాత జీవనంలోకి వెళ్ళండి. అదే మాదిరి మరోమారు ఆలోచన చేయండి. అవే పనులు చేయండి. డేటింగ్ చేయండి. మీ పార్టనర్ కు ఒక బహుమతి ఇవ్వండి లేదా కనీసం పూలవంటివి ఇచ్చి ఆమెకు సంతోషం కలిగించండి. మరోమారు మీరు రొమాంటిక్ జంటలుగా పేరుపడండి. తండ్రులు ప్రతి 20 నిమిషాలకు సెక్స్ గురించిన ఆలోచనలుచేయండి. ఒక స్నేహితుడిని లేదా బంధువును ఇంట వుంచుకుంటే, పిల్లల భారం వారు చూస్తే మీరు మరోమారు ఆనందించవచ్చు.
గుండె పోటు వస్తే, సెక్స్ కు బ్రేక్ ?
గుండెపోటు వచ్చినప్పటికి రతి ఆచరించటం గుండెకు మంచిదే. అది మరీ తీవ్రం అయితే తప్ప మీ రతి జీవితం ముగియనవసరంలేదు. రతిని ఒక మితమైన వ్యాయామంగా ఆచరించడం గుండెకు మంచిదే. రక్తపు ఒత్తిడి పెరిగి, ఆక్సిజన్ బాగా పీల్చుకోబడుతుంది. గుండెకు ఆరోగ్యం చేకూరుస్తుంది.
సమయం లేదు డార్లింగ్?
ఎంత సమయం మీకు లేకున్నా మీ పార్టనర్ తో ఒక అంగీకారానికి రావాలి. లైంగిక జీవితం ఆనందించాలి. అది ఒక కాంట్రాక్టు గా భావించాలి. కనీసం రాత్రులందు డిన్నర్ సమయం తర్వాతనైనా సరే దానికి అవకాశం కలిగించి పార్టనర్ ని ఆనందపెట్టాలి. దానిని ఒక ఆటగా భావిస్తే మీకు ఒత్తిడి వుండదు. ఇద్దరూ కలిసి సాయంకాలాలు గడిపితే, దానిలో భాగమే చక్కటి లైంగిక జీవితంగా వుంటుంది.
అంగ స్తంభన అవుట్....?
అంగస్తంభన సరిగా జరగటం లేదంటే, అధిక రక్తపోటు, అధిక కొలెస్టరాల్, రక్తనాళాలు అడ్డుపడటం, అన్ని వుంటాయి. తగిన చికిత్స అవసరమే అయినప్పటికి, వయసుతో వచ్చే మార్పులకు భయపడకండి. ఏభై సంవత్సరాల వయసు వచ్చిందంటే, అంగం స్తంభించటం కష్టమే. మెత్తబడి వుంటుంది. అయినప్పటికి వైద్యులను సంప్రదించండి. తగిన మందులు వాడండి. జీవితాన్ని అనుభవించ గలిగినంతవరకు అనుభవించండి.
తగ్గిపోతున్న సెక్స్ జీవితాలు
యౌవనంలో ఉన్నంత కోర్కెలు తర్వాతి రోజులలో వుండవు. ఆ భావనలు మరోసారి రావు. ఆ వయసులో ఏం చేసినా అదే భావన, అదే ప్రవర్తనగా వుంటుంది. మానవ జాతి అభివృధ్ధికిగాను ప్రకృతి ఆ ఏర్పాటు చేసింది. కాని తర్వాతి దశలలో మీరు పరిపక్వతలు చెందటంతో సంబంధాలు రూపాంతరం చెంది తండ్రిగా, ప్రవర్తించవలసి వస్తుంది.
పరిపక్వత చెందిన సంబంధం దానికి తగ్గ ఆనందం పొందుతుంది. భాగస్వామి పట్ల తృప్తి, నమ్మకం, పెరుగుతాయి. గతంలో మెయిన్ డిష్ అయిన లైంగికతలు ఇపుడు సైడ్ డిష్ గా మారిపోతాయి. మారుతున్న పరిస్ధితులగురించి ఆలోచించండి. మార్పు చెందిన మీ లైంగిక జీవితం కొరకు ఎదురు చూడండి.