శారీరక, మానసిక ఆనందాలను అందించే రతి క్రీడలు స్త్రీ పురుషులకు యుక్తవయసు లేదా టీనేజ్ నుండే ప్రారంభం అవుతాయి. టీనేజ్ లో మొదలైన ఈ లైంగిక జీవితం మహిళకు షుమారుగా మెనోపాజ్ దశ వరకు కొనసాగుతూనే వుంటుంది. పురుషుడి కూడా ఆరోగ్యవంతుడు అనుకుంటే పురుష మెనో పాజ్ అంటే షుమారు 50 ఏళ్ళ వరకు కూడా ఆసక్తితోనే కొనసాగుతుంది. నేటి రోజులలో అందుబాటులో వున్న ఛానెళ్ళు, మీడియా ల కారణంగా ఇరువురికి అతి చిన్న వయసులోనే అన్ని విషయాలు అందుబాటులోకి వచ్చేసి, మధ్య వయసు వచ్చే సరికే....ఓస్ అంతేనా....అంటూ చప్పబడిపోతున్నాయి. అయితే, తాజాగా చేసిన ఒక సర్వే ఫలితాలు మహిళ లేదా పురుషుడి రతి జీవితానికి సంబంధించి ఏలా వున్నాయో పరిశీలించండి.
మహిళకు 28 సంవత్సరాలు, పురుషుడికి 33 సంవత్సరాల వయసులో రతి ఆనందం తారాస్ధాయిలో వుంటుందట. తర్వాత మెల్లగా తగ్గిపోతూ మాయమయ్యే దశకు కూడా వచ్చేస్తుందని ఒక సర్వే చెపుతోంది. మహిళలు సాధారణంగా 17 సంవత్సరాల వయసులో తమ కన్నెత్వాన్ని కోల్పోతున్నారని 25 సంవత్సరాలు వచ్చే సరికి వారి లైంగిక జీవితంలో చాలా భాగం అయిపోయినట్లు భావిస్తున్నారని సర్వే చెపుతోంది.
పురుషులు సగటున తమ పురుషత్వం అంటే మొదటి కలయికను 18 సంవత్సరాల వయసులో చేస్తున్నారని, 29 సంవత్సరాల వయసు వచ్చే సరికి తారాస్ధాయిలో తమ లైంగిక జీవితాలను ఆచరిస్తున్నారని సర్వే తెలిపినట్లు ది సన్ పత్రిక ప్రచురించింది. ఈ సర్వేలో, మహిళలను, పురుషులను వేరు వేరుగా ప్రశ్నలు వేశారు. ఏ వయసులో అత్యధిక ఆనందం కలిగే రతిక్రీడలను ఆచరించారని ప్రశ్నించగా 1281 మంది 28 సంవత్సరాల వ్యక్తులలో 40 శాతంమంది తాము టాప్ గా ఆనందించినట్లు తెలిపారట. 50 సంవత్సరాల వయసువారు, 60 సంవత్సరాల వయసు వారు కూడా తాము 46 సంవత్సరాలవరకు మంచి రతిక్రీడలను ఆచరించామని తెలిపారుట.
అయితే, పురుషులకు 18 సంవత్సరాలకే తారాస్ధాయికి చేరితే మహిళలకు అది 30 సంవత్సరాలకు కలిగిందని కూడా రీసెర్చిఫలితాలు వివాదిస్తున్నాయి. 20లు,30లు,40లు,50లు వయసువరకు రతి జీవితం సాగించినవారు 17 సంవత్సరాలకు మొదలుపెట్టగా 60 సంవత్సరాలవరకు రతిజీవితం ఆనందించిన వారు 18 సంవత్సరాలకు మొదలు పెట్టినట్లు తెలిసింది.
రీసెర్చి అంశాల ఫలితాలు సరైనవేనని భావించినప్పటికి, ఆధునికంగా నేటి టీనేజ్ గాల్స్ గతంలోని 13 లేదా 14 సంవత్సరాలు కాక, 11 సంవత్సరాలవయసుకే రుతుక్రమ ప్రభావాలకు లోనవటం గమనిస్తూనే వున్నాం. ఇంత త్వరగా యవ్వనాన్ని సంతరించుకునే వీరు అతి త్వరగా తమ రతి జీవితాలను ముగించేస్తున్నారు.