వివాహేతర సంబంధాలు చాలావరకు కార్యాలయాలలో సహచరులమధ్య నడుస్తున్నాయి. ఆఫీసులలోనే ఎపుడో అపుడు ఇవి మొదలవుతున్నాయి. తమ వ్యతిరేక సెక్స్ తో సన్నిహితంగా సంచరించటంతో ఇది మొదలవుతోంది. ప్రారంభంలో ఈ లైంగిక సంబంధాలు లేనప్పటికి, భావావేశాలతో మొదలై అది ఒక వ్యవహారానికి దారితీస్తోంది. భాగస్వామికి ద్రోహం చేయనిస్తోంది.
అయితే, ఈ వివాహేతర సంబంధాలు కూడా చాలావరకు అంటే షుమారుగా 80 శాతం విద్యావంతులలోనే జరుగుతున్నాయని నిపుణులుచెపుతున్నారు. వీటికి కారణం ఆర్ధికపర అంశాలు కూడా లేకపోలేదు. కుటుంబాన్నినడపాలంటే, బహుశభార్యకు ఆఆదాయం కావలసిందే. ఎఫైర్ అతనితో రద్దు చేసుకుంటే, ఆమెకు ఆ ఆదాయం రానట్లే. పిల్లల భాధ్యతలు వుండి మొగుళ్ళు వదిలేసిన మహిళలకు ఇదొక మార్గంగా కూడా వుంటోంది. జీవితంలో ఒకే భర్త, ఒకే భార్య అనే భావన మరికొంతకాలంలో మాయమవ నుందా?
ఈరకమైన లైంగిక స్వేచ్ఛకు కారణాలు పరిశీలిస్తే,
- భర్తలతో లైంగికపర అసంతృప్తి
- పారిపోయి రావటం
- వివాహ సంబంధ అంశాలు
- భాగస్వామి దూరంగావుండటం
- కొత్త అనుభూతులు రుచి చూడటంగా చెపుతారు.
ఈ రకమైన వివాహేతర సంబంధాలు ఎపుడు జరుగుతాయి?
- వివాహమైన మొదటిసంవత్సరంలో
- ఒక బిడ్డపుట్టిన తర్వాత
- ఏడు సంవత్సరాల సన్నిహిత అనుబంధంలో
- జీవితం మధ్యలో సంక్షోభం ఏర్పడితే
- ఒక భార్యతో కొన్నాళ్ళు హాయిగా గడిపేస్తే