తర్వాత 2011 ఏప్రిల్ లో వెల్లడైన స్టడీలో మహిళలు తమ ఫలదీకరణకు ముందు దశలో కూడా అధికంగా కామవాంఛలు కలిగి వుంటారని తేలింది. మహిళలకు రతి భ్రమలు అధికమవుతాయని, అది వారిలో మరింత కామోద్రేకం కలిగిస్తుందని తేలింది. నెలలో పిరియడ్ వచ్చే సమయంలో అధికమంది పురుషులతో తాము కూడుకుంటున్నట్లుగాకూడా వీరికి భ్రమలు కలిగాయని సర్వేలో మహిళలు వెల్లడించారు. ఈ పరిశోధనాంశాలనుకెనడాలోని ఆల్బర్టాలోని లెత్ బ్రిడ్జి యూనివర్శిటీ రీసెర్చర్, స్టడీ అధ్యయనకారులు సామంత డాసన్వెల్లడించారు. డాసన్, ఆమె సహచరులు ప్రత్యేకించి మహిళలకు వస్తున్న ఈ రతి భ్రమలను, స్టడీ చేశారు. వారికి వచ్చే ఈ భ్రమలు, పగటి కలలమాదిరిగా వున్నాయని, సెక్స్ పార్టనర్స్ లేకపోయినప్పటికి వారికి రతి చేసుకోవాలనే తీవ్రత అధికమవుతోందని వారు వెల్లడించారు.
మెదడులో వచ్చే భ్రమలన్నీ కూడా వారిలోని ఆసక్తికి నిదర్శనమని, అవి వారి వాస్తవ లైంగిక జీవన స్ధాయిని తెలుపుతాయని ఆమె తెలిపారు. రీసెర్చర్లు తమ పరిశోధనలో సుమారు 27 మంది మహిళలను, వీరిలో ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ నుండి సమాచారం పొందారు. ఒక నెలరోజులపాటు వారి రతి భ్రమలను డైరీ లో వ్రాయించారు. మూత్ర పరీక్షలు, అండోత్సర్గం సమయంలో పరిశీలించారు. స్టడీలో మహిళలు సగటున రోజుకు ఒక సారైనా రతిచేసినట్లు భ్రమకలుగుతోందని తెలిపారట. గతంలోని పరిశోధనలలో పురుషులు రోజుకు ఒక సారి రతిచేసినట్లు భ్రమిస్తే, మహిళలు వారినికి ఒక సారి మాత్రమే రతి చేసినట్లు భ్రమించినట్లు వెల్లడైంది.
అండోత్సర్గానికి సరిగ్గా మూడురోజులుందనగా ఈ భ్రమలు మరింత తరచుగా వస్తాయని, అపుడు రోజుకు 1.5 సార్లు కూడా రతి చేసినట్లు భ్రమ కలిగిందని ఇతర రోజులకంటే కూడా అండం విడుదల రోజుల్లో అధికంగా వున్నాయని మహిళలు తెలిపారు. ఈ మహిళలు, పురుషులకు ఎంత తీవ్రంగా భ్రమ కలుగుతుందో అదే స్ధాయిలో కలలుకంటున్నట్లు భావించారట. అంతేకాదు, భ్రమలు తీవ్రస్ధాయికి చేరి, పురుషులే కాక, మహిళలతో కూడా రతి ఆచరించినట్లు వీరు భావించడం జరిగిందట.