•  

రోజులో ఎన్ని సార్లు చేసుకోవచ్చు?

Is Masturbation Harmful for Health!
 
హస్తమైధునం అలవాటు జీవితంలోని చాలా దశలలో అంటే పిల్లవాడి దశనుండి వృధ్ధుల వరకు ఆచరిస్తూనే వుంటారు. పిల్లలు, టీనేజర్లు, యువకులు, వివాహమైనవారు, మతపర వ్యక్తులు, అన్ని రకాలవరూ ఆచరిస్తూనేవుంటారు. లైంగిక ప్రవర్తనలకు హస్తమైధునం మంచిదంటారు. కాని అది అధికమైతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది కరమే. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ చర్య మనల్ని మనం పాడుచేసుకోడం, మనలోమనం ఆనందించటం కింద వచ్చే అలవాటుగా చెప్పవచ్చు. బయటవుండే అవయవాన్ని స్వయం తృప్తికొరకు స్కలనం అయ్యేటంతవరకు స్వయంగా చేసుకోడాన్ని హస్తమైధునం అంటారు. రోజులో ఎన్ని సార్లు చేయాలనేదానికి లిమిట్ లేదు. వివిధ వయసులవారిని బట్టి అది వుంటుంది. వ్యక్తి ఎంపిక మేరకు ఇన్ని సార్లు అంటూ లేదు. అయితే, అది అధికమైతే, స్కలనం అధికమైతే, నరాల బలహీనత ఏర్పడుతుంది. అధికంగా చేసుకుంటూ పూోతే సెక్స్ హార్మోన్లు, అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని ప్రభావం బ్రెయిన్, ఇతర గ్రంధులపైనా కూడా వుంటుంది. శారీరక రసాయనాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.

హస్తమైదునం అధికమైతే, దాని సైడ్ ఎఫెక్టులు ఎలా వుంటాయో చూడండి!
- అలసట, చికాకు, కోపం
- వీపు కింది భాగం ప్రధానంగా నొప్పి పెట్టటం
- జుట్టు ఊడిపోవటం
- అంగస్తంభన బలహీనమవటం లేదా పూర్తిగా నిరుపయోగమవటం
- కంటి చూపు మందగించటం
- వృషణాల నొప్పి
- నడుము భాగం నొప్పి పెట్టటం

ఒక సర్వే మేరకు యౌవన దశలోవున్న యువకులు ప్రధానంగా హస్తమైధునానికి అలవాటు పడతారు. ఈ అలవాటు, స్త్రీలకంటే కూడా పురుషులకే అధికంగా వుంటుంది. దీనికి కారణం వారంతటవారే ఆనందం పొంది తృప్తి కలిగించుకోవచ్చునని భావించటమే. యౌవనంలో మొదలు పెట్టిన ఈ అలవాటును యువకులు కొంత వయసు మళ్ళే వరకు చేస్తూనే వుంటారు. దానితో వారికి ఇకపై హస్తమైధునం చేయాలనే కోరిక తగ్గిపోతుంది. ఇక ఆ వయసులో బూతు చిత్రాలు, ఫిలింలు చూసి చేసుకోటానికి ఇష్టపడతారు. దీర్ఘకాలంలో వారి కోరిక తీరకపోతే, హస్తమైధునం చేయటం సాధారణమే. పొగాకు, ఆల్కహాల్, మత్తుమందుల అలవాట్లున్నవారు దీనికి మరింత అలవాటు పడతారు. జీవిత భాగస్వాములు లేని సింగల్స్ కూడా దీనికి అలవాటు పడి తమ మగతనాన్ని చాటుకుంటారు.

హస్తమైధునం ఎన్నిరోజులకోసారి చేసుకోవచ్చు?
స్కలనం పురుషులలో వారానికి సగటున రెండు లేదా 3 సార్లు వుంటుంది. అయితే, స్కలనం లేకుండా అంగాన్ని స్తంభించటం అలవాటు చేసుకుంటే అంగం చాలా గట్టిపడుతూంటుంది. రతి అనుభవాలను మెరుగుపరచుకోడానికి, ఆరోగ్య పరంగాను డాక్టర్లు కూడా హస్తమైధునం సూచిస్తారు. అయితే, ఇది అధికమైతే, ఒత్తిడి, అలసట, మెమొరీ తగ్గటం జరుగుతాయి.

హస్తమైధునాన్ని కలిగించే కారణాలేమిటి?
హార్మోన్ల ప్రభావం - శరీరంలో అధికంగా తయారయ్యే టెస్టోస్టిరోన్ వంటివి వారిలోని కోరికను తీర్చేసుకోడానికి ప్రోత్సహిస్తాయి.
పెంపకం - పిల్లలు సరైన రీతిలో పెరగకపోతే, వారికి సోషల్ సర్కిల్ అధికంగా లేకుంటే ఈ రకమైన చర్యలకు దిగుతారు.
సామాజిక ప్రభావం - సెక్స్ అనేది ఒక పాపం అని భావిస్తూ సమాజంలో సాంప్రదాయంగా వుండే వారు కూడా తమలో తాము ఆచరిస్తారు.
సెక్స్ కోరికలు - సెక్స్ కోర్కెలు అధికంగా కలుగుతూంటే, ఈ చర్య చేపడతారు.

మరి ఈ హస్తమైధునాన్ని ఎలా నిరోధించాలి?
అధికంగా హస్తమైధునం చేయటం అనే అలవాటు మానాలి. ఆహారంలో అధిక ప్రొటీన్లు చేర్చాలి. కేఫైన్ పదార్ధం తగ్గించాలి. సీఫుడ్లు, కూరగాయలు, రెడ్ మీట్, పాల ఉత్పత్తులు పెంచాలి. రోజువారీ ఆహారంలో పండ్ల రసాలు, నీరు తప్పక చేర్చాలి.

English summary
The best way to reduce masturbation is to overcome the habit of doing it in excess. More proteins must be included in the diet and quantity of caffeine must be reduced intake of sea food, vegetables, red meat and dairy products must be enhanced. Juices and water must be included in regular diet.
Story first published: Thursday, April 5, 2012, 11:59 [IST]

Get Notifications from Telugu Indiansutras