రెండు ఎలుకలు కలిసిన తర్వాత వాటి మెదడులోని కణాలు గణనీయంగా పెరిగినట్లు ఓ పరిశోధనలో తేలింది. రతిక్రీడ తర్వాత హిప్పోకాంపస్‌లో న్యూరాన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
సెక్సువల్ యాక్టివిటీని ఆపేస్తే మెదడులో శక్తి సన్నగిల్లినట్లు వారు గుర్తించారు. ఒత్తిడిని తట్టుకోవడానికి శృంగారం గొప్ప సాధనంగా పని చేస్తుందని ఇదివరకటి పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. శృంగారంలో పాల్గొంటే మనుషులు స్మార్ట్‌గా అవుతారని తేలింది.
నడి వయస్సు ఎలుకలు కలుసుకున్న తర్వాత పరిశోధిస్తే వాటిలో కొత్త మెదడు కణాలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. తరుచుగా సెక్స్‌లో పాల్గొంటే మెదడు శక్తి పెరుగుతుందని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా గుర్తించారు.
సెక్స్ ఆపేస్తే...
సెక్స్ను ఆపేసిన జీవుల్లో మెదడుకు లభించే ప్రయోజనాలు దెబ్బ తిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఒత్తిడికి మందు..
సెక్స్ ఒత్తిడి వల్ల సంభవించే నష్టాలకు విరుగుడుగా పనిచేస్తుందని నిరుడు వెలువడిన ఓ అధ్యయనం తేల్చింది.
స్మార్ట్గా ఉన్నావంటే..
నువ్వు స్మార్ట్గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా ఎక్కువ శృంగారంలో మునిగి తేలావని అర్థం కాదని అట్లాంటిక్ వెబ్సైట్ వ్యాఖ్యానించింది. శృంగారం మాత్రమే సరిపోదని దాని అర్థం.
కొత్త కణాలు బతకాలంటే...
కొత్తగా జనించిన కణాలు మనుగడ సాగించాలంటే కఠిన శ్రమ కూడా అవసరమని న్యూరోసైన్స్ కాన్ఫరెన్స్ సొసైటీ సైకాలిజిస్ట్ ట్రేసీ షోర్స్ అన్నారు.
కొత్త కణాల కోసం...
వ్యాయామం, ప్రోజాక్, సెక్స్ కారణంగా కొత్త కణాలు జనిస్తాయని ట్రెసీ షోర్స్ చెప్పారు. వ్యాయామం చేస్తే వాటిని కాపాడుకోగలమని ఆమె అన్నారు.
రెండూ చేస్తే...
శృంగారంలో పాల్గొంటూ వ్యాయామం కూడా చేస్తే కొత్త కణాలు జనించడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోవడానికి వీలవుతుందని ట్రెసీ అన్నారు.