మరి ఇంత ప్రాధాన్యతగల ఈ కన్నెపొర అంటే అసలు ఏమిటి? కన్నెపొర లేదా హైమెన్ అనేది ఒక పలుచని చర్మం. ఈ చర్మం యోనిలోకి పురుషుని అంగాన్ని అడ్డగిస్తుంది. మొట్టమొదటి రతి చేసినపుడు, పురుషుడి అంగం చేసిన ఒరిపిడికి అది చినిగిపోతుంది. లేదా యువతి తనంతటతాను హస్తమైధునం చేసుకున్నా చినిగిపోతుంది.అది చినిగే సమయంలో నొప్పి కొద్దిపాటి రక్తం కూడా వస్తాయి. అది సాధారణంగా వుండేదే. రక్తం వచ్చిందంటే ఆమె అంతవరకు కన్నెగానే వున్నట్లు భావిస్తారు. అయితే, ప్రతి యువతికి రక్తం రానవసరం లేదు.
ఈ కన్నెపొర కనుక బాగా బిగువుగా వుంటే, పురుషులు రతిలో అధికంగా ఆనందిస్తారు. తమ మగతనాన్ని చాటుకునేటందుకు ఇదొక నిదర్శనంగా భావిస్తారు. మీరు ఒక క్రీడాకారులైనా, అధికంగా వ్యాయామాలు చేసేవారైనా, ఈ కన్నెపొర లేదా హైమన్ చినిగిపోయే అవకాశం వుంది. కన్నెపొర చినగటాన్ని ప్రభావిస్తూ అనేక వ్యాయామాలున్నాయి.
ఏ వ్యాయామాలు చేస్తే, కన్నెపొర చినిగిపోతుంది?
- కాళ్ళను వెడల్పు చేసి సాగతీసే వ్యాయామం.
- స్విమ్మింగ్
- సైకిలింగ్
- గుర్రపు స్వారి
పైన పేర్కొనిన వ్యాయామాలలో కన్నెపొర చినిగే అవకాశం బాగా వుంది.
ఈ వ్యాయామాల కారణంగా హైమన్ ఒత్తిడి కలిగించుకున్నప్పటికి, కొన్ని సమయాలలో మీరు ఈ పొరను నిలుపుకోగలుగుతారు. హైమన్ లేనంత మాత్రంలో ఆమె కన్నె కాదు అనరాదు. ఈ రకమైన వ్యాయామాలు చేసిన వారికి బ్లీడింగ్ రాకున్నా అది వారి కన్నెత్వం పోయినట్లు కాదు. ఇదే కారణంగా క్రీడాకారులైన యువతులకు తమ మొదటి రాత్రిలో బ్లీడింగ్ కలుగదు.