రతిక్రీడ ప్రభావం రోజువారీ జీవితంలో ఇతర విషయాలపై కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుందట. ఈ తరహా రతి క్రీడ... తృప్తితో పాటు.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెపుతున్నారు. అలాగే, ఆందోళన తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. ఉద్యోగం చేసేవారిలో కూడా సంతృప్తికరమైన వైవాహిక జీవితం ఉన్నప్పుడు, ఉద్యోగంలో వచ్చే అనేకరకాల ఒత్తిడులను అధిగమించగలుగుతారని పేర్కొంటున్నారు.అలాగే, మహిళలకు కూడా రతిలో ఇదే రకమైన భావప్రాప్తి లభిస్తే శరీరానికి, మనసుకు ఆనందాన్నిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారం అంటే సక్రమమైన శృంగారం గా వుండాలని, అక్రమ మార్గాల ద్వారా పొందే శృంగారంలో ఆనందం కంటే ఆందోళన, గిల్టీ ఫీలింగ్స్‌ ఎక్కువగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందుకే భర్తతో లేదా తనకు ఇష్టమైన పురుషుడితో ఏకాంతంగా శృంగారం పొందిన స్త్రీలు రోజంతా ఆనందంగా ఉంటారని వారు చెపుతున్నారు.
భార్యాభర్తల మధ్య జరిగే తృప్తికరమైన రతిక్రీడ అనేది ఒక స్లీపింగ్ టాబ్లెట్ లేదా ఓ మంచి కాఫీ లేదా టీ లాంటిదని, ఇది భాగస్వాముల అలసటను, ఆందోళనను తగ్గించి మంచి నిద్రను ఇస్తుందని చెపుతున్నారు. అలాగే, రోజంతా ఉత్సాహాన్నిస్తుందట. అలసిన శరీరానికి రతిక్రీడ మందులా పనిచేస్తుందని, రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ను దూరంగా ఉంచవచ్చు అన్నట్లే రోజూ భావప్రాప్తి కలిగితే ఆరోగ్యం అద్భుతంగా వుంటుందని ఈ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెపుతున్నారు.
అంతేకాకుండా, శృంగారం అన్నది భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుందట. వీరిలో పాజిటివ్‌ భావనలను పెంచి, సంతృప్తికరమైన శృంగార జీవితంలో భార్యాభర్తల్లో ఒకరంటే ఒకరికి నమ్మకం పెరుగుతుందని, ఇరువురిలో ఎవరికీ అనుమానాలకు అవకాశం లేకుండా చేస్తుందని తెలిపారు. అయితే, తనకు సెక్స్‌ కావాలని భర్తకు ఎలా తెలియజేయాలి? అన్నదే చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యగా గుర్తించినట్టు వారు చెప్పారు. అయితే కొందరు తెలివైన మహిళలు మాత్రం తమకు రతి కావాలని నేరుగా అడగక పోయినప్పటికీ, వివిధ రకాల హావభావాల ద్వారా వ్యక్తం చేస్తుంటారని, పురుషులు వారి కోర్కెలను గ్రహించాలని పరిశోధకులు వెల్లడించారు.